ప్రతి రైతు ఆన్‌లైన్ అమ్మకం దారుడే.. ఏపీ వ్యవసాయ మార్కెటింగ్‌కు నాలుగువేల కోట్లు..

  • Published By: sreehari ,Published On : July 23, 2020 / 02:56 PM IST
ప్రతి రైతు ఆన్‌లైన్ అమ్మకం దారుడే.. ఏపీ వ్యవసాయ మార్కెటింగ్‌కు నాలుగువేల కోట్లు..

ప్రతి రైతు ఆన్ లైన్ అమ్మకం దారుడేనంటోంది ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌కు దాదాపు నాలుగువేల కోట్లు కేటాయిస్తోంది. వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆర్బీకే పరిధిలో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్ యంత్రాలు పరికరాలను అందించనున్నట్టు తెలిపారు.

ప్రతి మండలానికో కోల్డు స్టోరేజీ ఏర్పాటు చేయాలని సూచించారు. తన వద్ద పలానా పంట ఉందని రైతు ఆర్బీకేకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అప్పుడు ఆ సమాచారం నేరుగా సెంట్రల్‌ సర్వర్‌కు చేరాలన్నారు. రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్‌ శాఖ తోడ్పాటునందించాలని జగన్ సూచించారు.

కనీస గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో రైతు ఆదుకోవాల్సిందిగా ఆదేశించారు. సెప్టెంబరు నెలకల్లా దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.