AP Covid : ఏపీలో కరోనా..24 గంటల్లో 4,348 కేసులు..ఇద్దరు మృతి

ఏపీలో ప్రస్తుతం 14 వేల 204 యాక్టివ్ కేసులుండగా...14 వేల 507 మరణాలు సంభవించాయని...47 వేల 884 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. కోవిడ్ వల్ల కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో

AP Covid : ఏపీలో కరోనా..24 గంటల్లో 4,348 కేసులు..ఇద్దరు మృతి

Ap Corona Cases

AP Covid New Cases : ఏపీ రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు అధికమౌతున్నాయి. పాజిటివ్ కేసులు అధికమౌతుండడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పలు నిబంధనలు, ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో 4 వేల 438 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Read More : Sanitary Napkins Free Village:దేశంలో తొలి శానిటరీ న్యాప్కిన్స్ రహిత గ్రామంగా ‘కుంబలంగి’ రికార్డు..పాడ్స్ కు బదులుగా..

ఏపీలో ప్రస్తుతం 14 వేల 204 యాక్టివ్ కేసులుండగా…14 వేల 507 మరణాలు సంభవించాయని…47 వేల 884 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. కోవిడ్ వల్ల కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చనిపోయారు. 24 గంటల్లో 261 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,17,56,521 శాంపిల్స్ పరీక్షించారు. 20 లక్షల 89 వేల 332 పాజిటివ్ కేసులకు గాను…20 లక్షల 60 వేల 621 మంది డిశ్జార్స్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14 వేల 204గా ఉంది.

Read More : Viral News: రైలు వస్తుండగా 9 నెలల చిన్నారితో సహా పట్టాలపై పడిపోయిన తల్లి

కేసుల వివరాలు : –
అనంతపురం : 230, చిత్తూరు : 932, ఈస్ట్ గోదావరి 247, గుంటూరు : 247, వైఎస్ఆర్ కడప : 147, కృష్ణా : 296, కర్నూలు : 171, నెల్లూరు : 395, ప్రకాశం : 107, శ్రీకాకుళం : 259, విశాఖపట్టణం : 823, విజయనగరం : 290, వెస్ట్ గోదావరి : 86. మొత్తం : 4348