ఏపీలో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 462 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం కొత్తగా 462 వైరస్ బారిన పడ్డారు. వీరిలో రాష్ట్రంలోని వారు 407 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వారు 40 మంది, విదేశాల నుంచి వచ్చిన 15 మందికి పాజిటివ్ వచ్చిందని ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 9,834 కే చేరింది. కృష్ణా 3, కర్నూలు 3, గుంటూరులో ఒకరు కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 119 కి చేరింది. ప్రస్తుతం 5 వేల 123 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 4,592 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 20, 639 వైద్య పరీక్షలు చేయగా 439 బంది వైరస్ సోకినట్లు తేలింది.
కొత్తగా వచ్చిన కేసుల్లో తూర్పుగోదావరిలో 87 మంది బాధితులు ఉన్నారు. అనంతపురంలో 68, కర్నూలులో 53, కృష్ణాలో 33, పశ్చిమగోదావరిలో 31, చిత్తూరులో 26, కడపలో 24, విశాఖలో 21 మందికి కరోనా వైరస్ సోకింది. నెల్లూరులో 7 ప్రకాశంలో ఐదు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున కరోనా బారిన పడ్డారు. కర్నూలు, కృష్ణా అనంతపురం, గుంటూరు జిల్లాల్లో కరోనా దూకుడు కొనసాగుతోంది.
కర్నూలు, కృష్ణా జిల్లాలో కేసులు 1000 దాటేశాయి. కర్నూలులో 1407 కేసులు, కృష్ణాలో 1096, అనంతపురంలో కేసుల సంఖ్య 938కు చేరింది. గుంటూరులో 852, తూర్పుగోదావరిలో 706, పశ్చిమగోదావరిలో 635, చిత్తూరులో 615 కేసులు ఉన్నాయి. నెల్లూరులో 484 బాధితులున్నారు. విశాఖలో 326 కే చేరాయి. అయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మాత్రం వంద లోపే పాజిటివ్ కేసులు ఉన్నాయి.
Read: తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ లాక్ డౌన్.