48 గంటల డెడ్‌లైన్ తర్వాతా బాబుది అదే సవాల్

  • Published By: sreehari ,Published On : August 5, 2020 / 05:39 PM IST
48 గంటల డెడ్‌లైన్ తర్వాతా బాబుది అదే సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్ ముగిసింది. కొత్త అస్త్రాలను బైటకుతీయలేదుకాని, రాజీనామా సవాల్‌కే కట్టుబడ్డారు. రాజీనామా చేయండి…లేదంటే అసెంబ్లీని రద్దుచేయిండి. ఎన్నికలంటే ఎందుకంత భయం? జగన్‌కు తనమీద తానే నమ్మకంలేదని కామెంట్ చేశారు.

3 రాజధానుల అంశంపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ కు 48 గంటల టైం ఇస్తూ చంద్రబాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆయన ఆన్ లైన్ వేదికగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతికి కూడా పవిత్ర నదుల నుంచి నీరు తీసుకొచ్చారని అన్నారు.



అమరావతికి అండగా ఉంటామని అప్పుడే మోడీ హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికల ముందు జగన్, వైసీపీ నేతలు ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలన్నారు. మీరందరూ ప్రజలను నమ్మించారని, ఐదు కోట్ల మంది ప్రజలను మీరు మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు.



ప్రజలను మోసం చేయడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. ఈ పోరాటం నా కోసమో, లేదంటే నా కుటుంబం కోసమో టీడీపీ కోసమో కాదన్నారు. ప్రజల్లో చైతన్యం, తిరుగుబాటు రావాలన్నారు. ఇష్టానుసారం ప్రవర్తించే వారికి బుద్ధి చెప్పే పరిస్థితి రావాలని చంద్రబాబు చెప్పారు