చిచ్చుర పిడుగు.. చిన్నారి.. ఐదేళ్లకే ఇంగ్లీష్ పదాలను గుక్కతిప్పుకోకుండా చదివేస్తోంది!

చిచ్చుర పిడుగు.. చిన్నారి.. ఐదేళ్లకే ఇంగ్లీష్ పదాలను గుక్కతిప్పుకోకుండా చదివేస్తోంది!

Girl Anshuaadhya Konakalla reads English sentence in minutes : చిచ్చుర పిడుగు.. ఐదేళ్ల చిన్నారి.. ఇంగ్లీష్ పదాలను అవలీలగా చదివేస్తోంది. క్షణాల వ్యవధిలో ఇంగ్లీష్ పదాలు, సెంటెన్స్ నిమిషాల సమయంలో చెప్పేస్తోంది. ఇంగ్లీష్ బుక్ ముందు పెడితే చాలు.. అక్షరాలను స్పీడ్ గా చదివేస్తోంది. ఎక్కడ కూడా ఆపదు.. మొదటి పెడితే మళ్లీ పూర్తి అయ్యే వరకు ఆపేది లేదు. గుక్క తిప్పుకోకుండా ఇట్టే ఇంగ్లీషు చదివేయగలదు. ఇంగ్లీష్ అంటే భయపడేవారికి ఈ చిన్నారి ఆదర్శంగా నిలుస్తోంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టోరీని కేవలం ఒక నిమిషంలోనే చదివేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

విజయవాడకు చెందిన ఈ చిన్నారి పేరు Anshuaadhya Konakalla. చిన్నారి తల్లిదండ్రులు వైశాలి కొనకళ్ల, ఉమామహేశ్వర కొనకళ్ల దంపతులు విజయవాడలో నివాసం ఉంటున్నారు. చిన్నారి అన్షుఆధ్యా 2016, జూన్ 6న జన్మించింది. ప్రస్తుతం పాపకు ఐదు ఏళ్లు. ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ లో ఎల్‌కేజీ చదువుతోంది. చదువుపై ఏకాగ్రత, శ్రద్ధ కనుబరుస్తూ.. ఏది చదివినా ఇట్టే నేర్చేసుకుంటోంది. చిన్నారి టాలెంట్‌ను గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించడం మొదలుపెట్టారు.

అలా ఇంగ్లీష్ భాషను మరింత అనర్గళంగా చదివేలా ప్రోత్సహించారు. ఇంగ్లీష్ పుస్తకాలు కొని ఇచ్చేవారు. 12లైన్ల 137 పదాలు ఇంగ్లీష్ స్టోరీని కేవలం ఒకే ఒక నిమిషంలో చదవగలదు. 2021, జనవరి 30న 60 (6-14 లెటర్స్) పెద్ద పదాలను ఒక్క నిమిషంలోనే చదివేసింది. చిన్నారి ప్రతిభను చూసినవారంతా అవాక్కైపోతున్నారు.