విజయవాడలో 60 శాతం లాక్ డౌన్

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. విజయవాడలో 60 శాతం లాక్ డౌన్ విధించారు.

విజయవాడలో 60 శాతం లాక్ డౌన్

Vijayawada Lockdown

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. విజయవాడలో 60 శాతం లాక్ డౌన్ విధించారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా కృష్ణా జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని 64 డివిజన్లలో 42 కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించారు. విజయవాడలోని కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు వర్తిస్తాయి. కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలు ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

రాష్ట్రంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 216 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో మరో ఇద్దరు చనిపోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారు 147మంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 69మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

ఏపీలో కరోనా కేసులు భారీ పెరిగాయి. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 3,990కి చేరింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 77కి పెరిగింది. ఏపీలో 1510 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,403 మంది కోలుకున్నారు. ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది