Amaravati Farmers : అమరావతిలో 600వ రోజు రైతుల నిరసనలు

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధానిలో రైతుల నిరసనలు 600వ రోజుకు చేరుకున్నాయి. భారీ ర్యాలీలకు రాజధాని రైతులు పిలుపునిచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు.

Amaravati Farmers : అమరావతిలో 600వ రోజు రైతుల నిరసనలు

Amaravati Protest

Amaravati farmers’ protests : నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధానిలో రైతుల నిరసనలు 600వ రోజుకు చేరుకున్నాయి. భారీ ర్యాలీలకు రాజధాని రైతులు పిలుపునిచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు. రాజధానిలోకి కొత్తవారిని అనుమతించడం లేదు. రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రకాశం బ్యారేజీ, సీతానగరంతో పాటు రాజధాని ప్రాంతంలో బారీగా పోలీసులు మోహరించారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు ఆంక్షలు విధించారు. కరకట్టపై 4 చోట్ల చెక్ పోలీసులు ఏర్పాటు చేశారు. కరకట్టపై వాహనాలను అపి చెక్ చేస్తున్నారు.

అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు చేపట్టిన ఉద్యమం నేటితో 600 రోజులకు చేరింది. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఆదివారంతో 600వ రోజుకు చేరుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రాజధాని తరలిపోకుండా ఉండాలని రైతులు చేయని ప్రయత్నమంటూ లేదు. లాఠీలు విరిగినా, జైళ్లకు పంపినా, కరోనా భయపెడుతున్నా లెక్కచేయకుండా అమరావతి పోరాటం కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా అమరావతి నుంచి మంగళగిరి వరకు రైతులు ర్యాలీ చేసేందుకు సంకల్పించారు. రాజధాని నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఇందుకు అనుమతి లేదని తుళ్లూరు పోలీసులు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించారు.