అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు…రెడ్ జోన్లలో కూడా తెరుచుకోనున్న లిక్కర్ షాపులు

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2020 / 12:46 PM IST
అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు…రెడ్ జోన్లలో కూడా తెరుచుకోనున్న లిక్కర్ షాపులు

కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం లాక్ డౌన్ ను మే-17వరకు పొడిగినట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసింతే. అయితే కరోనా కేసులను బట్టి దేశాన్ని రెడ్,గ్రీన్,ఆరెంజ్ జోన్లుగా విభజించి ఆయా జోన్లలో వివిధ కార్యకలాపాలకు అనుమతిస్తూ కేంద్రం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. అయితే కరోనా కేసులు అత్యధికంగా ఉన్నచోట్ల ఎటువంటి పబ్లిక్ మూమెంట్ కు అనుమతించేది లేదని కేంద్రం సృష్టం చేసింది.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెడ్ జోన్లలో లిక్కర్ షాపులు తెరడంపై బ్యాన్ విధిస్తున్నట్లు కేంద్రహోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. గ్రీన్,ఆరెంజ్ జోన్ల లిక్కర్ షాపులు తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు సృష్టం చేసిన హోంశాఖ… రెడ్ జోన్లలోని స్వతంత్ర్య మద్యం షాపులు లేదా కాలనీల్లో ఉన్న లిక్కర్ స్టోర్ లు మాత్రమే మాత్రమే తెరుచుకునేందుకు అనుమతిచ్చినట్లు ఆ రిపోర్ట్ లో తెలిపింది.

రెడ్ జోన్లలోని మార్కెట్ కాంప్లెక్స్ లేదా మాల్స్ లోని మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో….కరోనా కేసులు అత్యధికంగా ఉండి రెడ్ జోన్లుగా పరిగణించడబడిన ముంబై,హైదరాబాద్,ఢిల్లీ,కోల్ కతా,జైపూర్,ఇండోర్ వంటి సిటీల్లో మద్యం షాపులు తెరుచుకునేందుకు అనుమతిచ్చింది. అయితే మాల్స్,మార్కెట్ కాంప్లెక్స్ లోని లేని కాలనీల్లో ఉండే,సింగిల్ గా ఉండే మద్యం షాపులు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అయితే లిక్కర్ స్టోర్ లను ఓపెన్ చేయడానికి సంబంధించి తుది నిర్ణయం ఆయా రాష్ట్రాలదేనని హోంశాఖ సృష్టం చేసింది.