పాసులున్నా కూలీలను నిలిపివేసిన ఏపీ పోలీసులు..తెలంగాణ-ఏపీ సరిహద్దులో పడిగాపులు  

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2020 / 03:21 PM IST
పాసులున్నా కూలీలను నిలిపివేసిన ఏపీ పోలీసులు..తెలంగాణ-ఏపీ సరిహద్దులో పడిగాపులు  

తెలంగాణ-ఏపీ సరిహద్దు వాడపల్లి దగ్గర కూలీలు పడిగాపులు గాస్తున్నారు. ఉదయం నుంచి సరిహద్దు వద్ద ఏపీ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. నల్లగొండ ఎస్పీ కూలీలకు పాసులు జారీ చేశారు. సరిహద్దులోనే కూలీలను ఏపీ పోలీసులు నిలిపివేశారు. నల్లగొండ పోలీసులు ఇచ్చిన పాసులు చెల్లవని గుంటూరు పోలీసులు చెబుతున్నారు. సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. 

ఇప్పటికే కేంద్ర వలస కార్మికులకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దామరచర్ల వద్ద షెల్టర్లలో ఉంటున్న కూలీలకు పోలీసులు పాసులు జారీ చేశారు. దీంతో రాత్రి వారిని మూడు బస్సుల్లో తరలించారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చిన ఏపీకి సంబంధించిన వారిని అనుమతించారు. ఈరోజు తెల్లవారుజామున నుంచి దాదాపు 40 నుంచి 60 మంది కూలీలు, అలాగే వివిధ ప్రాంతాల్లో పని చేసే అక్కడికి చేరుకున్నారు. 

వారిని గుంటూరు జిల్లా వాడపల్లి దగ్గర ఆపివేశారు. పాసులు ఉంటేనే అనుమతిస్తాం..పాసులు తెచ్చుకోవాలని కోరడంతో వారు తిరిగి నల్గొండ పోలీసులు ఆశ్రయించారు. పోలీసులను రిక్వెస్టు చేయడంతో ఇటు నల్గొండ పోలీసులు కూడా జిల్లా ఎస్పీ రంగనాథం గారిని అదే విధంగా ఉన్నత అధికారులను సంప్రదించి ఆపై ఎస్పీ అక్కడిక్కడే పాసులు జారీ చేయాలని ఆదేశించారు. అదే విధంగా ఆయన కూడా అక్కడికి చేరుకుని పాసులు జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. 

పాసులు తీసుకొని తిరిగి గుంటూరు జిల్లా పొందుగుల చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్లినా ఈ పాసులు కూడా చెల్లవని అక్కడి పోలీసులు చెప్పారు. హైదరాబాదుతో పాటు వివిధ ప్రాంతాలనుంచి వీరంతా వస్తున్నారు. అటువంటి వారికి నల్గొండ పాసులు తెచ్చుకోవడం కరెక్ట్ కాదని.. ఎలా అనుమతి ఇస్తామని అన్నారు. వారు ఎక్కడినుంచి అయితే బయలు దేరారో అక్కడినుంచే పాసులు తెచ్చుకోవాలన్నారని వెనుదిరిగి వస్తున్న కూలీలు చెబుతున్నారు. 

ప్రస్తుతం వారు అక్కడే పడిగాపులు పడుతున్నారు. ఉదయం తెల్లవారుజామున 5:00 నుంచి పడిగాపులు కాస్తున్నా.. ఇక్కడ ఎటువంటి వసతులు లేవని, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకోవడం సరికాదని కూడా వారు కోరుతున్నారు.