పెళ్లి వ్యాన్ బోల్తా : డ్రైవర్ నిర్లక్ష్యం ఏడుగురి ప్రాణాలు తీసింది – ఆర్టీఏ

  • Published By: madhu ,Published On : October 30, 2020 / 11:05 AM IST
పెళ్లి వ్యాన్ బోల్తా : డ్రైవర్ నిర్లక్ష్యం ఏడుగురి ప్రాణాలు తీసింది – ఆర్టీఏ

7 killed as vehicle overturns in Andhra’s East Godavari Thantikonda Village : తూర్పుగోదావరి జిల్లా తంటికొండ ప్రమాదఘటనాస్థలాన్ని ఆర్టీఏ అధికారులు పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఎంవీఐ సురేశ్ బాబు వెల్లడించారు. ఘాట్ రోడ్డుకు రిటర్నింగ్ వాల్ లేకపోవడంతో నేరుగా లోయలో పడిపోయిందని, మెట్ల మార్గంలో పడడం వల్ల ప్రాణనష్టం ఎక్కువ జరిగిందన్నారు. ప్రమాదానికి గురైన వాహనం ప్యాసింజర్లను ఎక్కించేది కాదన్నారు.



తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. స్పాట్‌లోనే ఐదుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. గాయపడిన 10 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.



తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం రాత్రి వివాహం జరిగింది. అర్థరాత్రి 2గంటల తరువాత పెళ్లి బృందం సభ్యులు టాటా ఏస్‌ ఆటోలో ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. డ్రైవర్ ఆటోను కొండ దిగువ వైపునకు పార్క్ చేసి పెట్టాడు. ఆటోలో 30మంది వరకు ఎక్కారు. డ్రైవర్ ఆటో స్టార్ట్ చేసిన తరువాత.. వెనుక ఉన్న వారు తమ లగేజ్ పైన పెట్టమని కోరారు.



డ్రైవర్ అనాలోచితంగా.. ఆటో పైకి ఎక్కడంతో.. వాహనం డౌన్‌లోకి కదిలింది. భయపడిపోయిన ఆటో డ్రైవర్ పై నుంచి కిందికి దూకేశాడు. ఆటో ఘాట్‌రోడ్డును ఢీకొట్టుకుంటూ పక్కనే ఉన్న మెట్లపై పల్టీలు కొట్టింది. అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాద ఘటనపై పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

ఏంవీఐ సురేశ్ : – 
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తంటికొండ ప్రమాదం.
టాటా ఎస్ ఆటోకు అన్ని అనుమతులున్నాయి.
ఇది కేవలం లగేజీ వెహికల్, సాధారణ ప్యాసింజర్లను ఇందులో ఎక్కించరాదు.

ఈ ప్రమాదంలో డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయాడు.
డ్రైవర్ లైసెన్స్ తో పాటు వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం.
ఘాట్ రోడ్ కు రిటర్నింగ్ వాల్ లేకపోవడం ఆటో లోయలో పడిపోయింది.
సుమారు 15 మీటర్ల లోతులో ఆటో పడిపోయింది.
మెట్ల మార్గంలో పడడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది.