Children Corona : ఏపీలో రెండు రోజుల్లో 9మంది చిన్నారులకు కరోనా, ఆందోళనలో తల్లిదండ్రులు

రాష్ట్రంలో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 9మంది చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆసుపత్రి పాలవుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది.

Children Corona : ఏపీలో రెండు రోజుల్లో 9మంది చిన్నారులకు కరోనా, ఆందోళనలో తల్లిదండ్రులు

Children Corona

Children Corona : రాష్ట్రంలో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 9మంది చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆసుపత్రి పాలవుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది.

కరోనా సోకిన పదేళ్లలోపు చిన్నారులు తొమ్మిది మంది తిరుపతి రుయా పరిధిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. వీరిలో కడప జిల్లా చెందిన ముగ్గురు, చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు ఉన్నారు. వీరంతా శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రంలోపు చేరిన వారే. వీరిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు రుయా అధికారులు తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో ఇంతమంది పిల్లలు ఆస్పత్రిలో చేరడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. గడిచిన 15 రోజుల్లో మరో 20 మంది చిన్నారులూ చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక పుత్తూరు పట్టణం పిళ్లారిపట్టులో పదేళ్లలోపు పిల్లలు ఎనిమిది మందికి కరోనా సోకింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించారు. ఇటీవల వీరి తల్లిదండ్రులకు పాజిటివ్‌ రావడంతో వారి నుంచి పిల్లలకు సోకి ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు.

కొన్ని వారాలుగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో అల్లాడిపోయిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 83వేల 690 కరోనా పరీక్షలు నిర్వహించగా 8వేల 976 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1,669 కొత్త కేసులు నమోదవగా, చిత్తూరు జిల్లాలో 1,232 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 298 మందికి పాజిటివ్ అని తేలింది.

అదే సమయంలో రాష్ట్రంలో 13వేల 568 మంది కరోనా నుంచి కోలుకోగా, 90 మంది మృతిచెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది మరణించారు. ఇప్పటిరకు ఏపీలో 17,58,339 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 16,23,447 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 1,23,426 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 11,466కి చేరింది.