విశాఖలో లీక్ అయిన కెమికల్ గ్యాస్ ఇదే, ఎంత డేంజర్ అంటే..

  • Published By: naveen ,Published On : May 7, 2020 / 05:22 AM IST
విశాఖలో లీక్ అయిన కెమికల్ గ్యాస్ ఇదే, ఎంత డేంజర్ అంటే..

విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్(lg polymers) పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. కెమికల్ గ్యాస్ వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెయ్యి మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపుగా 3 కిలోమీటర్ల మేర కెమికల్ గ్యాస్ వ్యాపించింది. గ్యాస్ ప్రభావానికి చెట్లు మాడిపోయాయి. గ్యాస్ ఘాటైన వాసనకు మూగ జీవాలు విలవిలలాడాయి. కోళ్లు, కుక్కలు, పక్షులు, ఆవులు, గేదెలు మృత్యువాత పడ్డాయి. గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాయి. 

వేలమంది అస్వస్థతకు గురి కావడం, పలువురు చనిపోవడంతో కంపెనీ నుంచి లీక్ అయిన గ్యాస్ గురించి చర్చ మొదలైంది. కంపెనీ నుంచి లీక్ అయిన కెమికల్ గ్యాస్ ఏంటని అంతా ఆరా తీస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి లీక్ అయిన గ్యాస్ పేరు స్టైరిన్ మోనోమర్(styrene monomer gas). ఈ గ్యాస్ లీక్ కావడం కారణంగా ఇంతటి ఘోరం జరిగింది. కాగా ఈ కెమికల్ గ్యాస్ ప్రాణాంతక విషవాయువు అని ఇది చాలా డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తులు, గుండె, కళ్లు, చెవులు, మెదడు, కిడ్నీ, చర్మంపై ప్రభావం చూపుతుందన్నారు. లాంగ్ టర్మ్ లో కేన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. అధిక మోతాదులో లీక్ అయితే చాలా ప్రమాదం అన్నారు. స్టైరిన్ మోనోమర్ వల్ల కలిగే అనర్థాలు చాలానే ఉన్నాయి. 

స్టైరిన్ మోనోమర్ దేహంలోని ఏయే భాగాలపై ప్రభావం చూపుతుందంటే:
* తలనొప్పి
* వాంతులు
* కళ్ల మంట
* చర్మంపై దద్దుర్లు
* నరాలు పని చేయకపోవడం
* శ్వాస సంబంధ ఇబ్బందులు
* ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావం
* వినికిడి లోపం
* దృష్టి లోపం
* చర్మం లోపల నుంచి బయటి వరకు మొత్తం మండటం
* శ్వాస అందదు
* ఊపిరితిత్తులు, గుండె, చర్మం, కళ్లు, చెవులు, మెడదు, కిడ్నీలపై ప్రభావం
* తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు
* కేన్సర్ కూడా వచ్చే ప్రమాదం
* సడెన్ గా ప్రాణాలు పోయే అవకాశం
* 1999 లో స్పెయిన్ లో వాటర్ లో లీక్ అయిన స్టైరిన్
* స్టైరిన్ మోనోమర్ అత్యంత ప్రమాదకరమైనది
* ఊపిరితిత్తుల్లోకి నీరు చేరే అవకాశం
* విపరీతమైన తలనొప్పి
* వాంతులు, విరేచనాలు
* దేహంలోని ప్రతి అవయవంపై ప్రభావం చూపే స్టైరిన్
* లాంగ్ టర్మ్ లో కేన్సర్ కు దారితీసే ప్రమాదం
* భోపాల్ లో లీక్ అయిన గ్యాస్ అంత ప్రమాదం కాదు

విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్(lg polymers) పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. కెమికల్ గ్యాస్ వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు లాక్‌డౌన్‌లో ఉన్న ఈ కంపెనీని తెరిపించే క్రమంలో గురువారం(మే 7,2020) తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలం పాటు స్టోరేజ్ లో ఉంచడం, ఉష్ణోగ్రతల్లో తేడాలు రావడం వల్లే కెమికల్ గ్యాస్ లీక్ కావడానికి కారణం అని కంపెనీ వర్గాలు తెలిపాయి.

 

 

 

 

Also Read | ఉలిక్కిపడ్డ విశాఖ.. కెమికల్ గ్యాస్ ప్రభావంతో మాడిన చెట్లు, మృతి చెందుతున్న మూగజీవాలు