ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం…11మంది కూలీలు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2020 / 02:59 PM IST
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం…11మంది కూలీలు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో కూలీలతో వెళుతున్న ట్రాక్టర్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. రు. ట్రాక్టర్‌ స్తంభాన్ని ఢీకొన్న వెంటనే అది విరిగిపోయి కరెంట్‌ వైర్లు కూలీలపై పడి అందరికి షాక్‌ కొట్టింది.

ఈ ప్రమాదంలో 11 మంది వలసకూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన వారిలోె ఏడుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. మృతులు మాచవరం ఎస్సీ కాలనీకి చెందినవారు. వీరందరూ మిర్చి కోతలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ఉన్నపలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైనవారిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మృతిచెందిన వారిలోె ఏడుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్‌లో డ్రైవర్‌తో కలిపి 23మంది ఉన్నారు.ప్రమాదానికి కారణం అతి వేగంతో పాటు, డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. 

కాగా, ప్రకాశం జిల్లా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.