Eluru : ఏలూరు సబ్ రిజిస్ట్రార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు

ప.గో జిల్లా ఏలూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిష్టార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. రిజిస్ట్రార్ ఆఫీస్ లో జయరాజు అనే వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

Eluru : ఏలూరు సబ్ రిజిస్ట్రార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు

Eluru (1)

A case of sexual harassment registered : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. రిజిస్ట్రార్ కార్యాలయంలో జయరాజు అనే వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అదే ఆఫీస్ లోని ఆడిట్ సెక్షన్ లో అటెండర్ గా పని చేస్తోన్న వివాహిత దిశా పోలీసులను ఆశ్రయించింది.

జయరాజు గతకొద్ది రోజులుగా తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ వివాహిత దిశా పోలీసులను ఆశ్రయించింది. జయరాజు వేధింపుల గురించి సదరు మహిళా ఉద్యోగిని జిల్లా రిజిస్టార్ కి తెలపగా అధికారులు అతన్ని మందలించారు.

Constable Suicide : ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

అతని ప్రవర్తనలో మార్పురాకపోగా తన కోరిక తీర్చకపోతే ప్రాణహాని తలపెడతానని జయరాజు బెదిరింపులకి పాల్పడ్డాడు. అధికారుల సూచనల మేరకు సదరు వివాహిత దిశా పోలీస్టేషన్ లో అతనిపై పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దిశా పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.