Rahul Murder : రాహుల్ హత్య కేసులో ఐదుగురిపై కేసు నమోదు

విజయవాడ రాహుల్ హత్య కేసును కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

Rahul Murder : రాహుల్ హత్య కేసులో ఐదుగురిపై కేసు నమోదు

Rahul (2)

Rahul murder case : విజయవాడ రాహుల్ హత్య కేసును కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్, ఏ2గా కోగంటి సత్యం పేర్లు చేర్చారు. ముగ్గురు మహిళల ప్రేమేయం కూడా రాహుల్ హత్యలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ హత్యలో పాత్రధారులుగా భావిస్తున్న పద్మజ అనే పేరుతో ఉన్న ఇద్దరు మహిళల పేర్లను కూడా ఏ3, ఏ4గా చేర్చారు. ఏ5గా గాయత్రి పేరును నమోదు చేశారు. కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలుకు చర్చలు జరిగాయని… తన వాటా డబ్బుల కోసం కోరాడ విజయ్‌కుమార్ అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని రాహుల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరాడ కుటుంబ సభ్యులకు హత్యతో సంబంధముందని రాహుల్ తండ్రి రాఘవరావు ఆరోపించారు.

విజయవాడ నడిబొడ్డున కారులో దారుణ హత్యకు గురైన రాహుల్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రాహుల్‌ది హత్యేనని ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి కారులో మూడు గంటల పాటు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు పోలీసులు తేల్చారు. ఇప్పటికే నిందితుల కోసం పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

రాహుల్ కారులో తాడు, తలదిండును స్వాధీనం చేసుకున్నారు. మృతుడి మెడ కిందిభాగంలో ఒరుసుకుపోయినట్లు క్లూస్ టీమ్ గుర్తించింది. దిండుతో ముఖంపై అదిపి, తాడుతో గొంతు నులిమి రాహుల్‌ను హత్య చేసినట్టు నిర్ధారించారు. రాహుల్ హత్యకు ఆర్థిక విబేధాలే కారణం కావచ్చని భావిస్తున్నారు. గంటలో వస్తానంటూ బుధవారం రాత్రి ఏడున్నరకు ఇంటి నుంచి వెళ్లిన రాహుల్.. ఆ తర్వాత ఇంటికి రాలేదు. దీంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.

విజయవాడలోని డీవీమేనర్ రోడ్‌లో కారులో డెడ్ బాడీ ఉందనే సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు. కారు షోరూం నుంచి మెకానిక్‌లను రప్పించి కారు డోర్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అవి తెరుకోలేదు. దీంతో కారు అద్దం పగులగొట్టి అతి కష్టం మీద పోలీసులు కారు డోర్స్‌ని ఓపెన్‌ చేశారు. అయితే స్పెషల్ టీమ్‌తో టెక్నాలజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.