Constable Suicide : పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

ఏపీలో విషాదం నెలకొంది. పోలీస్ స్టేషన్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Constable Suicide : పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

constable suicide : ఏపీలో విషాదం నెలకొంది. పోలీస్ స్టేషన్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో రామకృష్ణ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు.

ఇటీవలే ఆళ్లగడ్డ నుంచి నందద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ అదే పీఎస్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Khammam Constable Suicide : ఖమ్మంలో విషాదం.. కొన్ని గంటల్లో నిశ్చితార్ధం.. కానిస్టేబుల్ ఆత్మహత్య !

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ ఆత్మహత్యకు పని ఒత్తిడా, కుటుంబ సమస్యలా లేదా ఇతర కారణాలున్నాయా? అన్న కోణంలో విచారిస్తున్నారు.