Couple Suicide : ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరిలో దూకి ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరి నదిలో దూకేశారు. చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన భార్యాభర్తల జాడ ఇంకా తెలియలేదు.

10TV Telugu News

couple suicide : పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరి నదిలో దూకేశారు. చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన భార్యాభర్తల జాడ ఇంకా తెలియలేదు. ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు కంచి సతీష్, సంధ్య గోదావరిలో దూకేశారు. గోదావరిలో దూకిన నలుగురిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.

నాలుగేళ్ల జస్విన్, రెండేళ్ల శ్రీదుర్గ సహా గోదావరిలో దూకేయడంతో సతీష్, సంధ్య కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వీరిలో రెండేళ్ల పాప శ్రీదుర్గ మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లాలోని దిండి రిసార్ట్ వద్ద పోలీసులు గుర్తించారు.

తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన సతీష్ గల్ఫ్ లో ఉద్యోగం చేసేవాడు. ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన సతీష్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఉన్న భార్యా పిల్లలను మొగలికుదురు తీసుకెళ్తానని చించినాడ బ్రిడ్జీ వద్ద బైక్ ఆపాడు. ఆనంతరం నదిలో దూకేయడంతో గల్లంతయ్యారు. గోదావరి పూటుగా ఉండటంతో విస్తృత గాలింపు కష్టమవుతుంది.

34 ఏళ్ల సతీష్, 24 ఏళ్ల సంధ్య, నాలుగేళ్ల జస్విన్ కోసం గోదావరి ఒడ్డు నుంచే గాలిస్తున్నారు. కంచి సతీష్ భార్య వివాహేతర సంబంధమే ఆత్మహత్యలకు దారి తీసిందని అనుమానాలున్నాయి. ఘటనా స్థలిలో బట్టలు, సూసైడ్ లెటర్ ఉన్నాయి. సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్న ఎలమంచిలి పోలీసులు.. ఆ లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

10TV Telugu News