Sea Shore Drone : శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో డ్రోన్ కలకలం
శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో డ్రోన్ కలకలం రేపింది. భావనపాడు సమీపంలో మత్స్యకారులకు డ్రోన్ చిక్కింది.

Sea Shore Drone : శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో డ్రోన్ కలకలం రేపింది. భావనపాడు సమీపంలో మత్స్యకారులకు డ్రోన్ చిక్కింది. సుమారు 9 అడుగుల పొడవు, 111 కిలోల బరువుతో చిన్నపాటి విమానాన్ని పోలి ఉంది. దీనిపై బాన్షీ టార్గెట్ అని ఇంగ్లీష్ అక్షరాలతో రాసి ఉంది. 8001 నెంబర్ కూడా ఉంది.
సంతబొమ్మాళి మండలం భావనపాడు మూలపేట తీరంలో మత్స్యకారులు వేట సాగిస్తుండగా ఈ డ్రోన్ దొరికింది. మత్స్యకారులు దీనిని మెరైన్ పోలీసులకు అప్పగించారు. దీనిని పరిశీలించిన పోలీసులు మిలటరీ డ్రోన్ గా అనుమానిస్తున్నారు.
Shot Down Pakistan Drone : పాకిస్తాన్ డ్రోన్ కూల్చివేసిన బీఎప్ ఎఫ్ జవాన్లు
డిఫెన్స్ మిస్సైట్ ప్రయోగం సమయంలో విఫలమై సముద్రంలో పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. డ్రోన్ పై నేవి, ఇంటెలిజెన్స్ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.