Fish Lorry Overturned : చేపల లారీ బోల్తా.. కనీసం కనికరం చూపని జనం, ఎలా ఎత్తుకెళ్లారో చూడండి..

చేపల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అందులో ఉన్న చేపలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి. రోడ్డు మీద పడిన చేపల కోసం జనాలు ఎగబడ్డారు. ఎవరు ఏమైపోతే మాకెందుకు అన్న రీతిలో.. చేపలను సంచుల్లో వేసుకోవడంలో బిజీ అయిపోయారు.

Fish Lorry Overturned : చేపల లారీ బోల్తా.. కనీసం కనికరం చూపని జనం, ఎలా ఎత్తుకెళ్లారో చూడండి..

Fish Lorry Overturned : ఫ్రీగా వస్తే దేన్నీ వదిలిపెట్టరు. పక్క వారు ప్రమాదంలో చిక్కుకుని చావు బతుకుల్లో ఉన్నా పట్టించుకోరు. అలాంటి జనాలున్న రోజులివి. ఇది నిజమే అనిపించే ఘటన ఒకటి ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. చేపల లోడ్ తో వెళ్తున్న లారీ జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో బోల్తా పడింది. లారీ కింద పడటంతో అందులో ఉన్న చేపలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు.

కాగా, ఈ ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారేమో అని కూడా పట్టించుకోలేదు అక్కడి జనం. లారీ డ్రైవర్, క్లీనర్ బతికున్నారా లేదా అని కూడా చూడలేదు. వారి చూపంతా చేపల మీదే ఉంది.

రోడ్డు మీద పడిన చేపల కోసం జనాలు ఎగబడ్డారు. ఎవరు ఏమైపోతే మాకెందుకు అన్న రీతిలో.. చేపలను సంచుల్లో వేసుకోవడంలో బిజీ అయిపోయారు.

కర్నాటక నుంచి వెస్ట్ బెంగాల్ కు చేపల లోడ్ తో వెళ్తున్న లారీ.. అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్ కు గాయాలు కావడంతో పోలీసులు వారిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, రోడ్డు మీద పడిన చేపలను సంచులు తెచ్చుకుని మరీ తీసుకుపోతున్న స్థానికులను పోలీసులు నిలువరించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జనం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో.. లారీలో ఉన్న మనుషులకు ఏమైనా అయ్యిందా? వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? బతికున్నారా? లేదా? అని కనీసం కనికరం కూడా చూపకపోవడం.. అయ్యో పాపం అనాల్సింది పోయి.. అసలు పట్టించుకోకుండా ఇలా చేపల కోసం ఎగబడటం ఆందోళనకు గురి చేస్తోంది. మనిషిలో మానవత్వం, సాయం చేసే గుణం, దయ, జాలి, కనికరం కనుమరుగు అవుతోందనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది.