Shocking : చెట్టు తొర్రలో పెద్ద సైజు గుడ్లు… పగలగొట్టి చూసి షాకైన జనం..!

చెట్టు తొర్రలో పెద్ద సైజు గుడ్లను చూసి షాక్ అయ్యారు ఆ ఊరి స్థానికులు. భయంతో గజగజ వణికిపోయారు. కొంతమంది దూరంగా పరిగెత్తారు. మరికొందరు వింతగా ఆ గుడ్లను చూస్తుండిపోయారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

Shocking : చెట్టు తొర్రలో పెద్ద సైజు గుడ్లు… పగలగొట్టి చూసి షాకైన జనం..!

A Huge Snake Eggs Found In Tree Bark In Ap Krishna Distritct

Python Eggs in Tree Bark : చెట్టు తొర్రలో పెద్ద సైజు గుడ్లను చూసి షాక్ అయ్యారు ఆ ఊరి స్థానికులు. భయంతో గజగజ వణికిపోయారు. కొంతమంది దూరంగా పరిగెత్తారు. మరికొందరు వింతగా ఆ గుడ్లను చూస్తుండిపోయారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామంలో కొండచిలువ పిల్లలు బయటపడ్డాయి. పొట్టిపాడు ఏలూరు కాల్వ సమీపంలో ఒక చెట్టు తొర్రలో భారీ గుడ్లను స్థానికులు గుర్తించారు. ఇంతకీ ఏ గుడ్లు అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. తీరా గుడ్లను పగలగొట్టేసారికి అంతా షాక్ అయ్యారు.

ఆ గుడ్లలో కొండచిలువ పిల్లలు కనిపించాయి. అంతే స్థానికులంతా హడలిపోయారు. అప్రమత్తమై ఆ పిల్లలను కొట్టి చంపేశారు. లోతుగా తవ్వగా.. చెట్టు తొర్రలో కొండచిలువ ఆవసం ఉంది. బహుషా ఇక్కడే కొండచిలువ గుడ్లు పెట్టిందని అంటున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.