Leopard : నెల్లూరు జిల్లాలో చిరుత పులి కలకలం

నెల్లూరు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో చిరుత పులి కనిపించింది.

Leopard : నెల్లూరు జిల్లాలో చిరుత పులి కలకలం

leopard

leopard : నెల్లూరు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో చిరుత పులి కనిపించింది. కడప నుంచి బస్సులో వెళ్తోన్న ప్రయాణికులకు చిరుత పులి కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సెల్ ఫోన్ కెమెరాల్లో చిరుత పులిని చిత్రీకరించారు.

అంతలోనే బస్సు హారన్ వినిపించడంతో పారిపోయింది. ఇటీవలే ఓ ఆవుపై చిరుత పులి దాడి చేసింది. ఇప్పుడు మళ్లీ ఘాట్ రోడ్డుపై సంచరిస్తూ కనిపిస్తుండటంతో స్థానికులు భయపడుతున్నారు.