యువతి ఫోటోకి మార్పింగ్ చేసి బెదిరింపులు..మరో తొమ్మిది మంది మహిళలకు వేధింపులు

గుంటూరును న్యూడ్ వీడియోల వ్యవహారాలు వెంటాడుతున్నాయి. ఓ యువతి ఫోటోకి మార్పింగ్ చేసి బెదిరింపులకు దిగిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. రఘుబాబు అనే యువకుడు ఓ యువతికి ఇన్ స్టా గ్రామ్

యువతి ఫోటోకి మార్పింగ్ చేసి బెదిరింపులు..మరో తొమ్మిది మంది మహిళలకు వేధింపులు

గుంటూరును న్యూడ్ వీడియోల వ్యవహారాలు వెంటాడుతున్నాయి. ఓ యువతి ఫోటోకి మార్పింగ్ చేసి బెదిరింపులకు దిగిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. రఘుబాబు అనే యువకుడు ఓ యువతికి ఇన్ స్టా గ్రామ్ లో మార్పింగ్ చేసిన నగ్న ఫోటోలతో బెదిరింపులకు దిగాడు. నిజమైన న్యూడ్ ఫోటోలు పంపకపోతే సోషల్ మీడియాలో ఈ మార్పింగ్ చేసిన ఫోటోలు వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.

ఇలాగే ఏకంగా పది మహిళలను బ్లాక్ మెయిల్ చేశాడు. చివరకు యువతి ఫిర్యాదుతో నిందితుడు రఘుబాబును పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపట్నం మండలం పుర్లమెరకు చెందిన రఘుబాబు మల్టీ మీడియా చేసి ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. తొమ్మిది నెలలుగా మహిళలనూ వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులు చెప్పారు.

గతంలో కొచ్చిలో యానిమేషన్ అనే మల్టీ మీడియా కోర్సులో పని చేశారు. లాక్ డౌన్ పరియడ్ లో ఖాళీగా ఉండటంతో సొంతూరైన నిజాంపట్నంకు వచ్చాడు. ఫేస్ బుక్ లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి న్యూడ్ ఫోటోలు పంపి వారిని కూడా బెదిరింపులు గురిచేస్తున్నాడు. పది మంది మహిళలను బెదిరించించాడు. వీరిలో ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.