ఏపీ ESI స్కామ్‌లో 19మంది నిందితులు, కస్టడీ కోసం పిటిషన్ వేస్తాం

ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఈఎస్ఐ స్కామ్ పై ఏసీబీ జాయింట్ డైరెక్టర్(జేడీ) రవికుమార్ శనివారం(జూన్ 13,2020)

  • Published By: naveen ,Published On : June 13, 2020 / 05:56 AM IST
ఏపీ ESI స్కామ్‌లో 19మంది నిందితులు, కస్టడీ కోసం పిటిషన్ వేస్తాం

ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఈఎస్ఐ స్కామ్ పై ఏసీబీ జాయింట్ డైరెక్టర్(జేడీ) రవికుమార్ శనివారం(జూన్ 13,2020)

ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఈఎస్ఐ స్కామ్ పై ఏసీబీ జాయింట్ డైరెక్టర్(జేడీ) రవికుమార్ శనివారం(జూన్ 13,2020) మీడియాతో మాట్లాడారు. ఈఎస్ఐ స్కామ్ లో దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశామన్నారాయన. ఈ స్కామ్ లో మరికొంతమందిని విచారించాల్సి ఉందన్నారు. హైకోర్టులో అచ్చెన్న, రమేష్ కుమార్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. ఈ కేసులో మొత్తం 19మంది నిందితులు ఉన్నారని ఏసీబీ జేడీ వెల్లడించారు. రెండు ఎఫ్ఐఆర్ లపై విచారణ కొనసాగుతుందన్నారు. నిందితుల కస్టడీ కోసం సోమవారం కోర్టులో పిటిషన్ వేస్తామని ఏసీబీ జేడీ తెలిపారు. 

ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్న అరెస్ట్:
ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని శుక్రవారం(జూన్ 12,2020) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి.. సోదాలు కూడా నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ కూడా రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తోంది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

ఏపీ ఈఎస్ఐలో భారీ స్కామ్:
ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం బయటపడింది. ఈ స్కామ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. ఈఎస్‌ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. ఈఎస్ఐ డైరెక్టర్లు రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. మొత్తం రూ.988 కోట్లకు సంబంధించి రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగిందని గుర్తించారు. ఈఎస్‌ఐ రవికుమార్, రమేష్, విజయను బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే.. 135శాతం అధికంగా టెండర్లలో చూపించిన సంస్థలు నకిలీ కొటేషన్లతో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్న పాత్ర ఉందని నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఈఎస్ఐలో రూ.150 కోట్ల మేర నిధులు దుర్వినియోగం:
రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ కేసుతో సంబంధం ఉన్న సీకే రమేష్ కుమార్ (తిరుపతి), జీ విజయ కుమార్ (రాజమండ్రి), డాక్టర్ జనార్దన్ (కడప), ఈ రమేష్ బాబు, ఎంకేబీ చక్రవర్తిల(విజయవాడ)ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ జేడీ రవికుమార్ మీడియాకు తెలిపారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈఎస్ఐలో రూ.150 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని విజిలెన్స్ విచారణలో తేలిందని, దీంతో ఈ కేసును ఏసీబీ చేపట్టిందన్నారు. నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌లతో నిధులు కాజేశారని, ఈ టెండర్ విధానాన్ని పాటించలేదని వెల్లడించారు. ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని తెలిపారు. ప్రభుత్వం తరపున ఉత్తర్వులు ఇవ్వాల్సిన ఉన్నతాధికారులకు తెలియకుండానే ఇవన్నీ జరిగాయన్నారు. ముందుగా నోటీసులు ఇచ్చాకే అరెస్ట్ చేశామని, ఈ వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు.

ఈఎస్ఐ స్కామ్ కేసు విషయానికి వస్తే.. ఆంధ్ర ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ అండ్ మెడికల్ ఇన్స్యూరెన్స్‌లో 2014-15 నుంచి 2018-19 వరకు జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు మేరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు చేసింది. పలు అవినీతి అక్రమాలు జరిగినట్లు నిర్దారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఏసీబీ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా 988.77 కోట్లా విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోలులో 150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ అక్రమాల్లో ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మకై ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లు తేల్చారు. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు మరియు ప్రైవేటు వ్యక్తులు కలిపి 19 మంది ప్రమేయం గుర్తించారు.

ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారిలో
1. అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి
2. చింతల కృష్ణప్ప రమేష్ కుమార్, రిటైర్డ్ డైరెక్టర్ అఫ్ IMS..
3. గాడి విజయ కుమార్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జెన్, ESI హాస్పిటల్ రాజమండ్రి.. పూర్వపు డైరెక్టర్, IMS.
4. వి. జనార్ధన్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, IMS,కడప.
5. ఇవన రమేష్ బాబు, సీనియర్ అసిస్టెంట్, O/o DIMS, AP, విజయవాడ.
6.M.K.P. చక్రవర్తి, సూపరింటెండెంట్, O/o DIMS, AP, విజయవాడ. (ప్రస్తుతం అండర్ సస్పెన్షన్)

నేను ఏ తప్పు చేయలేదు:
ఈ వ్యవహారంపై అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో టెలీ హెల్త్ సర్వీసెస్‌కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాసానని చెప్పుకొచ్చారు. మిగతా రాష్ట్రాల ఏ విధానాలు అవలంభించాయో అలా వ్యవహరించాలని సూచించానని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఎలా అమలు చేశారో.. అలాగే అమలు చేశామని.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని.. రికార్డుల్ని పరిశీలించి చర్యలు తీసుకోవచ్చన్నారు.