AP : టికెట్ల వ్యవహారానికి త్వరలో ఎండ్ కార్డ్.. సీఎం జగన్‌‌తో చిరు.. సినీ పెద్దల భేటీ రేపే

సినిమా టికెట్ ధరల పెంపుపై ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఈ కమిటీ 3సార్లు భేటీ అయింది. కమిటీ రిపోర్టును

AP : టికెట్ల వ్యవహారానికి త్వరలో ఎండ్ కార్డ్.. సీఎం జగన్‌‌తో చిరు.. సినీ పెద్దల భేటీ రేపే

Chiranjeevi Cm Jagan

 Film Ticket Issue : ఏపీలో సినిమా సమస్యలపై సీఎం జగన్‌తో రేపు చిరంజీవి భేటీ కానున్నారు. చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాత దానయ్య, యువి క్రియేషన్స్ వంశీకృష్ణరెడ్డి, దిల్ రాజుతో పాటు మరికొందరు తెలుగు సినీ ప్రముఖులు సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినీ పరిశ్రమలో సమస్యలు, బీ, సీ సెంటర్లలో టిక్కెట్ రెట్లు పెంపు, బెనిఫిట్ షోలు, 5వ షోకు అనుమతిపై చర్చించనున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు రెండు వారాలు టిక్కెట్ రెట్లు పెంచుకోవడం, కరెంట్ చార్జీలు, స్టేట్ ట్యాక్స్ తదితర అంశాలపై చర్చ జరగనుంది.

Read More : Uttarakhand : రాజ్ నాథ్ సింగ్ నోట పుష్ప డైలాగ్..

సినిమా టికెట్ ధరల పెంపుపై ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఈ కమిటీ 3సార్లు భేటీ అయింది. కమిటీ రిపోర్టును మంగళవారం మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రికి అందజేశారు. ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న టిక్కెట్ రెట్లపై అందరికీ ఆమోదయోగ్యంగా B, C సెంటర్లలో మినిమం రేటు 40 రూపాయలు ఉండే విధంగా జీవో ఇచ్చే అవకాశం ఉంది. కొత్తగా తెచ్చే టికెట్ రేట్లతోనే బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. చిన్న సినిమాలకు పనికొచ్చే 5వ షోకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది.

Read More : Vijayawada : వివాహితపై అత్యాచారం.. వీడియో, ఫొటోలు తీసిన భార్య

భారీ బడ్జెట్ సినిమాలకు రెండు వారాలు టిక్కెట్ రెట్లు పెంపు అంశంలో రేటు మరి ఎక్కువ కాకుండా ఉన్న రేట్లపై 20 శాతం పెంచుకొనే విధంగా అనుమతి ఇస్తారని చర్చ జరుగుతోంది. కరెంట్ చార్జీలపై ప్రస్తుతం ఉన్న స్లాబ్ సిస్టమ్‌ను మార్చి థియేటర్ల ఓనర్లకు ఊరట కలిగించే అవకాశం ఉందంటున్నారు. థియేటర్లలో తినుబండారాల రేట్లు, పరిశుభ్రత పాటించడం, లైసెన్స్ రెన్యూవల్‌ వంటి విషయాల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటోంది ప్రభుత్వం.