Suman: పార్లమెంటును ముట్టడిస్తాం -సినీనటుడు సుమన్

కేంద్రప్రభుత్వం కులగణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, సినీనటుడు సుమన్‌ ప్రకటించారు.

10TV Telugu News

Suman: కేంద్రప్రభుత్వం కులగణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, సినీనటుడు సుమన్‌ ప్రకటించారు. చిత్తూరు నుంచి కాణిపాకం వరకు నిర్వహిస్తున్న బీసీ శంఖారావం పాదయాత్రలో పాల్గొని మాట్లాడిన సుమన్.. కులగణనపై ఆరు రాష్ట్రాలు తీర్మానం చేశాయని, 20 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినట్లుగా చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే బీసీల కోసం అఖిలపక్షం ఏర్పాటు చేసి, కేంద్రానికి బీసీల హక్కులు, సమస్యల గురించి తెలియజేయాలని డిమాండ్ చేశారు సుమన్. బీసీలు అంటే కేంద్రానికి లెక్క లేకుండా పోయిందని, కులగణన ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు సుమన్. తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే పార్లమెంటును ముట్టడి చేస్తామన్నారు సుమన్.

×