అదానీ చేతికి లాభాల్లోని గంగవరం పోర్టు?

అదానీ చేతికి లాభాల్లోని గంగవరం పోర్టు?

Gangavaram-Port

Gangavaram Port: ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం ఎయిర్‌పోర్టు వాటా కోసం అదానీ గ్రూపు ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది. దేశంలోనే అతి పెద్ద పోర్ట్ ఆపరేటర్ గా ఎదిగే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ వార్బర్గ్ పింకస్ నుంచి గంగవరం పోర్టులో 31.5శాతం వాటాను దక్కించుకుంది.

అదానీ గ్రూపు వార్బర్గ్ వాటాను రూ.వెయ్యి 954కోట్లకు కొనుగులో చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీనిని బట్టి గంగవరం ప్రమోటర్ డీవీఎస్ రాజు వాటా 3వేల 662కోట్లు విలువ ఉంటుంది. మిగిలిన వాటా 10.4శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉంటుంది. రాష్ట్రం మొత్తంలో 64మిలియన్ మెగాటన్నుల కెపాసిటీతో ఉండే రెండో అతి పెద్ద పోర్టు ఇదే.

అదానీ మార్కెట్ షేర్ ఇండియాలో 12 లొకేషన్లలో 30శాతం పెరగనుంది. దేశంలోనే అతిపెద్ద 13బిలియన్ డాలర్ల ముంద్రా పోర్ట్ వీరి ఆధ్వర్యంలోనే నడుస్తుంది. సొంత రాష్ట్రం గుజరాత్ లో ఉన్న ఈ పోర్టుతో పాటు గత నెలలో మహారాష్ట్రలో ఉన్న డిఘీ పోర్టు కూడా కొనుగోలు చేసింది అదానీ గ్రూప్.

గంగవరం వేదికగా డ్రై కమోడిటీస్ అయిన బొగ్గు, ఇనుము, పంచదార, స్టీల్ ను హ్యాండిల్ చేస్తుంది. 2020 ఆర్థిక సంవత్సరంలో వీటితో రూ.516కోట్ల ఆదాయం వచ్చిపడింది. ఇక గంగవరం పోర్టు ద్వారా వచ్చే ఆదాయం 59శాతంగా కనిపిస్తుంది. పైగా అప్పులేమీ లేకుండా రూ.500కోట్ల లాభాల్లో దూసుకుపోతుంది.

కృష్ణపట్నంతో పాటు..
ఆంధ్రప్రదేశ్ లో కృష్ణపట్నం పోర్టును కొంతకాలం క్రితం అదానీ పోర్ట్స్ అండ్ ఎన్ఈజడ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గంగవరం పోర్టునూ దక్కించుకుంటే దేశానికి తూర్పు తీరంలో, ముఖ్యంగా ఆంధప్రదేశ్ రాష్ట్ర సముద్రతీరంలో అదానీ పోర్ట్స్ అత్యంత క్రియాశఈల సంస్థగా ఆవిర్భవించినట్లు అవుతుంది.