Admissions : హైదరాబాద్ ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ప్రవేశాలు

దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికెట్‌ కోర్సుకు పదోతరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన ప్రోగ్రామ్‌లకు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు ఫీజుగారూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 5, 2022 గా నిర్ణయించారు.

Admissions :  హైదరాబాద్ ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ప్రవేశాలు

Admissions : హైదరాబాద్‌ లోని ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం, ఆర్నెల్ల డిప్లొమా జర్నలిజం/ టీవీ జర్నలిజం, మూడు నెలల సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులను రెగ్యులర్‌, కరస్పాండెన్స్‌ విధానాల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో బోధన ఉంటుంది. ఆన్‌లైన్‌ సెషన్స్‌ ద్వారా క్లాసులు ఉంటాయి.

దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికెట్‌ కోర్సుకు పదోతరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన ప్రోగ్రామ్‌లకు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు ఫీజుగారూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 5, 2022 గా నిర్ణయించారు. అడ్మిషన్స్‌ ప్రక్రియ ఆగస్టు 12, 2022న ముగుస్తుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.apcj.in పరిశీలించగలరు.