Lockdown : ఏపీలో మళ్లీ లాక్‌డౌన్… వారం రోజులు ఆంక్షలు.. ఎక్కడంటే..

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండం చేస్తోంది. క్రమంగా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి చేరువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో మళ్లీ లాక్ డౌన్ విధించారు.

Lockdown : ఏపీలో మళ్లీ లాక్‌డౌన్… వారం రోజులు ఆంక్షలు.. ఎక్కడంటే..

Corona Lockdown

Again Corona Lockdown In Guntur : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండం చేస్తోంది. క్రమంగా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి చేరువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది.

వారం రోజులు లాక్ డౌన్:
కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇవాళ్టి(ఏప్రిల్ 1,2021) నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలులో ఉండనుంది. కరోనా కేసులు అధికంగా పెరగడంతో లాక్‌డౌన్‌ ప్రకటించినట్లు ఎమ్మార్వో శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజలంతా సహకరించాలని ముందుగానే మైక్‌ ప్రచారం చేయడంతో వెల్లటూరులో దుకాణాలు, కార్యాలయాలన్నీ స్వచ్ఛందంగా మూతబడ్డాయి. తాజాగా వెల్లటూరులో 10 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఏపీపై కరోనా పంజా:
రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. దేశంలో కరోనా సెకండ్ విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా మారింది. తాజాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,184 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 352 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి.

పెరుగుతున్న కేసులు, మరణాలు:
తాజాగా నమోదైన 1,184 కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,01,989 కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారికి మరో నలుగురు బలయ్యారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. తాజా మరణాలతో ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా మరణాల సంఖ్య 7,217కి పెరిగింది.

గంటూరు జిల్లాలో అత్యధిక కేసులు:
జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులని చూస్తే గుంటూరు జిల్లాలో అత్యధికంగా 352, విశాఖపట్నం జిల్లాలో 186, చిత్తూరు జిల్లాలో 115, కృష్ణాజిల్లాలో 113, నెల్లూరు జిల్లాలో 78, అనంతపురం జిల్లాలో 66, కర్నూలు జిల్లాలో 64, కడప జిల్లాలో 62, శ్రీకాకుళం జిల్లాలో 47, ప్రకాశం జిల్లాలో 45, తూర్పుగోదావరి జిల్లాలో 26, విజయనగరం జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుండి 456 మంది పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7వేల 338గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,50,83,179 నమూనాలను పరీక్షించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని అధికారులు కోరారు.