దేశ రాజధానిలో కలకలం : తెలుగు డాక్టర్ భార్య, డాక్టర్ మిస్సింగ్

దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. ఇద్దరు తెలుగు డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 11:08 AM IST
దేశ రాజధానిలో కలకలం : తెలుగు డాక్టర్ భార్య, డాక్టర్ మిస్సింగ్

దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. ఇద్దరు తెలుగు డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన

దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. ఇద్దరు తెలుగు డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఇద్దరు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్లారు, అసలేం జరిగింది.. అనేది మిస్టరీగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పీడియాట్రిక్‌ డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్‌ భార్య హిమబిందు, మరో డాక్టర్ దిలీప్ సత్య అదృశ్యం అయ్యారు. డాక్టర్ శ్రీధర్ తనతో పాటు కలిసి చదువుకున్న డాక్టర్ హిమ బిందు(29)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుకుంటున్న సమయంలో ఈ ఇద్దరితో పాటు డాక్టర్ దిలీప్‌ సత్య సన్నిహతంగా ఉండేవారు. ముగ్గురూ కలిసి ప్రాణ స్నేహితుల్లా మెలిగారు. డాక్టర్ దిలీప్‌ ప్రస్తుతం చండీగఢ్‌లో భార్య దివ్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇటీవలే పుదుచ్ఛేరిలో జిప్‌మర్‌ పరీక్ష రాసేందుకు వెళ్లారు. అక్కడి నుంచి డిసెంబర్ 25(క్రిస్మస్) ఉదయం 7.30గంటలకు ఢిల్లీ వెళ్ళిన డాక్టర్ దిలీప్.. అదే రోజున మధ్యాహ్నం 2.30కు చండీగఢ్‌ వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంది.

అయితే మధ్యాహ్నం వరకు సమయం ఉండటంతో.. శ్రీధర్‌ దంపతుల ఇంటికి వెళ్లారు డాక్టర్ దిలీప్. డాక్టర్ శ్రీధర్ అప్పటికే డ్యూటీకి వెళ్లిపోయారు. హిమ బిందు మాత్రమే ఇంట్లో ఉన్నారు. వారి ఇంటికి వెళ్లిన డాక్టర్ దిలీప్.. అల్పాహారం చేశారు. ఆ తర్వాత దిలీప్‌, బిందు కలిసి ఉదయం గం. 11.30 సమయంలో ఇంటి నుంచి బయల్దేరారు. శ్రీధర్‌ తన డ్యూటీ ముగించుకున్న తర్వాత భార్యకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. ఆ తర్వాత డాక్టర్ దిలీప్‌ ఫోన్‌కు కాల్‌ చేశారు. ఆ ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ రావడంతో ఆయన కంగారుపడ్డారు. వెంటనే రాత్రి 8.30 సమయంలో హౌజ్‌ఖాస్‌ పోలీస్‌ స్టేషన్ లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. రోజులు గడుస్తున్నా ఇద్దరి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన పెరిగింది. ఆ ఇద్దరి క్షేమ సమాచారం గురించి వర్రీ అవుతున్నారు.

ఈ మిస్సింగ్ మిస్టరీపై ఎయిమ్స్ బాడీ స్పందించింది. తక్షణ దర్యాఫ్తునకు పోలీసులను ఆదేశించాలని, ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వాన్ని కోరింది. సహచర వైద్యులు కూడా వర్రీ అవుతున్నారు. ఆ ఇద్దరు డాక్టర్లు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.