All The Best : పదో తరగతి పరీక్షలు..అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేక గదులు

  • Published By: madhu ,Published On : March 19, 2020 / 01:26 AM IST
All The Best : పదో తరగతి పరీక్షలు..అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేక గదులు

తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 19వ తేదీ గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 30 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

వీరికోసం 2530 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు పలు సూచనలు చేశారు. దగ్గు, జలుబు ఉన్న విద్యార్థులు వస్తే మాస్కు, శానిటైజర్ తీసుకురావాలని సూచించారు. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు. వైరస్ నేపథ్యంలో విద్యార్థులంతా ఒకేసారి రాకుండా..గుంపులు గుంపులు ఉండకుండా చర్యలు చేపట్టారు. విద్యార్థులు గంట ముందే.. పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. 

* ఎండకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల కోసం మంచినీ సౌకర్యం. 
* వైరస్ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద లిక్విడ్ హ్యాండ వాష్‌ల ఏర్పాటు. 
* అనారోగ్యంతో బాధ పడుతుంటే..వారి కోసం ప్రత్యేక గదులు. 
 

* కరోనా ఎఫెక్ట్‌తో ముఖానికి మాస్క్‌లు ధరిస్తే బెటర్. 
* పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్న 5, 34, 903 విద్యార్థులు. 
* 30 వేల 500 మంది ఇన్విజిలేటర్లు. 
* మాస్ కాపీయింగ్ జరుగకుండా ఉండేందుకు 144 సిట్టింగ్ స్వ్కాడ్స్. 4 ఫ్లెయింగ్ స్వ్కాడ్లు. 
Read More : ప్రపంచ వ్యాప్తంగా కరోనా : 8 వేల 943 మంది మృతి..ఏ దేశంలో ఎంత మంది చనిపోయారంటే