కరోనాపై ఏపీ యుద్ధం.. మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలు బంద్ 

  • Published By: sreehari ,Published On : March 19, 2020 / 11:10 AM IST
కరోనాపై ఏపీ యుద్ధం.. మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలు బంద్ 

కరోనాపై ఏపీ పోరాటం చేస్తోంది.. రాష్ట్రంలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తిస్థాయిలో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కరోనాను కట్టిడి చేసేందుకు ఎప్పటికప్పుడూ వైరస్ బాధితులను గుర్తించేందుకు లోతుగా పర్యవేక్షిస్తోంది. విదేశాల నుంచి వచ్చే ఏ ఒక్కరిని వదలడం లేదు. ప్రతి ఇంటికి వెళ్లి విచారించి కరోనా లక్షణాలు ఉన్న బాధితులను వెంటనే గుర్తిస్తోంది. బాధితుల సంఖ్య పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆంధ్రాలో తిరుమలతో పాటు అన్ని ఆలయాలు, విద్యాసంస్థలు అన్నింటిని మూసివేస్తోంది. ఏపీ రాష్ట్రాన్ని షట్ డౌన్ చేసింది.

కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఏపీలో తిరుమల సహా అన్ని ఆలయాలను మూసివేయనున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలు ఎవరూ భయటకు రావొద్దని, పెళ్లిళ్లు, ఫంక్షన్లు వాయిదా వేసుకోవడమే మంచిదన్నారు.

See Also | TTD సంచలన నిర్ణయం.. తిరుమల కొండపైకి నో ఎంట్రీ!

ఈనెల 31 వరకు మాల్స్, థియేటర్లు మూసివేయాలని ఆళ్ల నాని చెప్పారు.  కరోనా నేపథ్యంలో బార్లు, రెస్టారెంట్లు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవాలన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడూ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 

ఏపీలో రెండు కేసులు మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చాయని ఆళ్ల నాని తెలిపారు. అన్ని ఆలయాల్లో యథావిథిగా నిత్య కైంకర్యాలు కొనసాగుతాయి తప్పా భక్తులకు మాత్రం అనుమతి లేదన్నారు. కరోనా పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆళ్ల నాని పేర్కొన్నారు. బుధవారం ఒంగోలులో ఒక కరోనా పాజిటీవ్ కేసు నమోదైని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన 12వేల మందిని స్ర్కీనింగ్ చేసినట్టు తెలిపారు.

విదేశాల నుంచి వచ్చిన ఎవరో గుర్తించేందుకు సర్వే చేసి 85 శాతం మందిని గుర్తించామన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు టెస్టులకు సహకరించకుంటే చర్యలు చేపడతామని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు, చర్యలకు అందరూ సహకరించాలని ఆళ్ల నాని కోరారు. ఐసోలేషన్ వార్డులు, రూమ్ లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. విజయవాడ, తిరుపతి, కాకినాడలో ల్యాబ్ లను ఏర్పాటు చేశామన్నారు.  

కరోనా వ్యాప్తితో ఇంద్రకీలాద్రిపై మార్చి 31 వరకు అన్ని సేవలను నిలుపదల చేశారు. అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశామని దుర్గగుడి ఈవో అన్నారు. అన్ని ఆర్జిత సేవలను కూడా నిలపుదల చేసినట్టు తెలిపారు. ఉగాది రోజు పంచాగశ్రవణం, అమ్మవారి సేవలకు అనుమతి లేదన్నారు. అమ్మవారికి జరిగే సేవలు నిరంతరం కొనసాగుతాయని ఈవో చెప్పారు.