Home » Andhrapradesh » మాదాసి వెంకయ్యపై వర్గపోరు.. అధిష్టానం వద్ద పంచాయితీ!
Updated On - 4:53 pm, Tue, 28 July 20
By
sreehariఅందర్ని కాదని ఆ జిల్లాలో ఓ నియోజకవర్గ నాయకుడికి అధికార పార్టీ అవకాశం కల్పించినా అందిపుచ్చుకోలేక పోతున్నాడనే టాక్ వినబడుతొంది. అధికార పార్టీ కార్యకర్తలే రెబల్ గామారి ఆయనను దించేసి మరోకరిని తేవాలని అధిస్టానం వద్ద పంచాయితీ పెట్టినట్లు ఆ ఊరంతా అనుకుంటున్నారు.
పుల్ టైంమ్ పాలిటిక్స్ కాకుండా ఓ వైపు వైద్య వృత్తి చేబడుతూనే మరో వైపు పాలిటిక్స్ నామినేటేడ్ పదవులు చేపడుతున్న సదరు నాయకుడు ఇంట గెలవెలలేక పోవడంతో నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు వర్గపోరుతో రచ్చకెక్కుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రకాశం జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలుండగా… అందులో కొండపి ఒకటి. ఇక్కడ రాజకీయాలు వినూత్నంగా ఉంటాయి. ఈ నియోజకవర్గం బాధ్యతలు చేపట్టడమంటే ఆషామాషీ కాదు. ఎమ్మెల్యేగా గెలిచినా… నియెజకవర్గ బాధ్యుడిగా ఉన్నా… ప్రధాన సామాజిక వర్గాల ఏలుబడిలోనే నాయకులు పనిచేయాలి.
ఈ క్రమంలోనే కొండపిలో వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మాదాసిపై మొదట్నుంచీ సీఎం జగన్ నమ్మకం పెట్టుకున్నా… గత ఎన్నికల దాకా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వరికూటి అశోక్‌బాబును కాదని మాదాసి వెంకయ్యకే పదవి కట్టబెట్టినా… ఆయన మాత్రం సమర్థంగా రాణించట్లేదని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు.
మాదాసికి ఇదే మైనస్‌గా మారిందా? :
వైద్య వృత్తిలో ఉన్న మాదాసి వెంకయ్య… 2019 ఎన్నికలప్పుడు జగన్ సునామీలో సైతం టీడీపీ అభ్యర్థి స్వామి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో మాదాసిపై సానుభూతి చూపించిన అధిష్టానం… పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవితో పాటు కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. రాజకీయ చతురత, అనుభవం లేకపోవడం, ఫుల్ టైం పాలిటిక్స్ మెయింటెయిన్ చేయలేకపోవడం మాదాసికి మైనస్‌గా మారిందట.
దీనికితోడు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల మధ్య అంతర్గత పోరును పరిష్కరించలేక… ఆయన అసమర్థ నాయకుడిగా మిగిలిపోయారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. తనను వ్యతిరేకిస్తున్న నాయకుల్ని కేసుల పెడతానంటూ బెదిరించినట్లు కూడా మాదాసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆయనను తప్పించి మరొకరికి పదవి ఇవ్వాలని :
మండల స్థాయి నేతల్ని కూడా మాదాసి కలుపుకొని పోవట్లేదని… ఆయన్ను కలిస్తే ఒక్క పని కూడా కావట్లేదంటూ… ఐదు మండలాల ప్రజల అసంతృప్తితో రగిలిపోతున్నారట. మరోవైపు ఇద్దరు, ముగ్గురు అసంతృప్త నేతలే కుట్ర చేసి ఓడించారని మాదాసి కూడా ఫీలవుతున్నారట.
దీంతో ఐదు మండలాల్లోని అన్ని గ్రామాల్లో పార్టీ రెండు, మూడు వర్గాలు విడిపోయిందని భావిస్తున్న పలువురు నేతలు… మాదాసిపై మంత్రి బాలినేనితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారని టాక్ వినిపిస్తోంది. ఆయన్ను వెంటనే తప్పించి… మరొకరికి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.
మండల స్థాయి నాయకులకు గౌరవం, పనుల్లో ప్రాధాన్యత నివ్వాలంటూ మంత్రి బాలినేని సూచించినా… మాదాసి వెంకయ్య పెడచెవిన పెట్టడం స్థానిక వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాదాసికి వైవీ సుబ్బారెడ్డి అండదండలుంటంతో ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి ఏర్పడిందని కార్యకర్తలు భావిస్తున్నారట.
మాదాసి వెంకయ్యను ఇన్‌ఛార్జ్‌గా తప్పించాలన్న డిమాండ్ ఊపందుకోవడంతో… జూపూడి ప్రభాకర్‌రావు తన అనుచర వర్గాన్ని పురికొల్పి నియోజకవర్గంలోకి ఎంటర్ కావాలని తెరచాటుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక ప్రజలు గుసుగుసలాడుకుంటున్నారు. మొత్తానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఏడాదిలోపే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మాదాసి వెంకయ్య… దాన్ని తట్టుకుని నిలబడతారో, లేదో చూడాలి.
రాజకీయాల నుంచి తప్పుకుంటా, మంత్రి పెద్దిరెడ్డి
CM Jagan campaign : తిరుపతి బై పోల్, 14న సీఎం జగన్ ప్రచారం ?
Janasena Pawan : పవర్ పంచ్.. వైసీపీకి జనసేనాని పవన్ సవాల్..
Ambati Rambabu: రాష్ట్రంలో ఇక టీడీపీ శకం ముగిసినట్లే
AP CM YS Jagan : స్పందన న్యూ వెర్షన్..కొత్త అంశాలు ఏంటీ ? తెలుసుకోవాల్సిన విషయాలు
Amaravathi: వైసీపీ-టీడీపీల మధ్య ల్యాండ్ వార్