Andhra Pradesh: అందుకే అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టాం: సీఎం జగన్

మ‌న్యం వీరుడు అల్లూరిని మ‌న‌ గుండెల్లో పెట్టుకున్నామ‌ని, అందుకే ఏపీలో అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని భీమవరంలో ప్ర‌ధాని మోదీ అల్లూరి సీతారామ‌రాజు కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే.

Andhra Pradesh: అందుకే అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టాం: సీఎం జగన్

Ys Jagan Mohan Reddy

Andhra Pradesh: మ‌న్యం వీరుడు అల్లూరిని మ‌న‌ గుండెల్లో పెట్టుకున్నామ‌ని, అందుకే ఏపీలో అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని భీమవరంలో ప్ర‌ధాని మోదీ అల్లూరి సీతారామ‌రాజు కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన అల్లూరి 125వ జ‌యంతి వేడుక‌ల్లో మోదీ, కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డితో పాటు జ‌గ‌న్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Modi: యావత్ భార‌త్ త‌ర‌ఫున అల్లూరికి పాదాభివంద‌నం చేస్తున్నాను: మోదీ

ఈ సంద‌ర్భంగా జ‌గన్ మాట్లాడుతూ… అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని అంతా ఏకమయ్యామ‌ని చెప్పారు. దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని స్వాతంత్ర్య యోధులంతా కలలు కన్నారని అన్నారు. మనల్ని మనం పాలించుకోవడం ప్రారంభమై 75 సంవత్సరాలు అవుతుందని చెప్పారు. స్వాతంత్ర్యం అంటే అమృతంతో సమానమ‌ని జ‌గ‌న్ అన్నారు. ఉద్యమంలో 190 సంవత్సరాలు పరాయి పాలనపై మనదేశం యుద్ధం చేసిందని చెప్పారు. భావాల పరంగా ఎన్నడూ మరణం లేని విప్లవకారుడు అల్లూరి అని ఆయ‌న అన్నారు. తెలుగు జాతి దేశ స్ఫూర్తి ప్రధాత అల్లూరి అని వ్యాఖ్యానించారు. అడవి బిడ్డలకోసం తనకు తానే ప్రాణత్యాగం చేసుకొన్న గొప్ప వ్యక్తి అని చెప్పారు. అల్లూరి త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

Sri Lanka crisis: పెట్రోల్, డీజిల్ కొర‌త‌.. శ్రీ‌లంక‌లో ఇప్ప‌టికీ తెరుచుకోని పాఠ‌శాల‌లు

ఈ సంద‌ర్భంగా కేంద్ర‌ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుండ‌డంతో పండుగ చేసుకుంటున్నామ‌ని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో బలిదానాలు చేశారని, కానీ ఆ బలిదానాల చరిత్ర ప్రస్తుత తరానికి తెలియదని అన్నారు. విప్లవవీరుడు తిరిగిన నేలకు రావాలని మోదీని కోరానని చెప్పారు. వెంటనే మోదీ వస్తానని మాటిచ్చి, ఆ మాట‌ను నిలుపుకున్నారని తెలిపారు. అల్లూరి సంచరించిన ప్రాంతాలన్నీ తీర్ధ‌యాత్ర కేంద్రాలుగా తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. ఈ సంవత్సరం అంతా అల్లూరి పేరు మారుమోగాలని ఆయ‌న అన్నారు.