Paderu Attract Tourists : పర్యాటకులను ఆకర్షిస్తున్న పాడేరు..పాల సముద్రాన్ని తలపిస్తున్న పొగమంచు

అల్లూరి సీతామరాజు జిల్లా పాడేరు ప్రకృతి అందాలకు నెలవు. వంజంగి కొండపై మంచు తెరల అందాలు ఎవరి మనసునైనా ఇట్టే దోచేస్తాయి. దట్టమైన పొగమంచు పర్యాటకులను ఆకర్షిస్తోంది. టూరిస్టులను రా..రమ్మని పిలుస్తోంది. కునువిందు చేస్తున్న మంచు తెరల అందాలను చూసి.. మదిలో కొత్త అనుభూతి నింపుకునేందుకు ఇప్పుడిప్పుడే పర్యాటకుల రాక ప్రారంభమైంది.

Paderu Attract Tourists : పర్యాటకులను ఆకర్షిస్తున్న పాడేరు..పాల సముద్రాన్ని తలపిస్తున్న పొగమంచు

Paderu attract tourists

Paderu Attract Tourists : అల్లూరి సీతామరాజు జిల్లా పాడేరు ప్రకృతి అందాలకు నెలవు. వంజంగి కొండపై మంచు తెరల అందాలు ఎవరి మనసునైనా ఇట్టే దోచేస్తాయి. దట్టమైన పొగమంచు పర్యాటకులను ఆకర్షిస్తోంది. టూరిస్టులను రా..రమ్మని పిలుస్తోంది. కునువిందు చేస్తున్న మంచు తెరల అందాలను చూసి.. మదిలో కొత్త అనుభూతి నింపుకునేందుకు ఇప్పుడిప్పుడే పర్యాటకుల రాక ప్రారంభమైంది.

వంజంగి కొండపై మంచు తెరల అందాలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి. మంచు తెరల అందం… నయనానందకరంగా మారుతోంది. మేఘాలు నేలపైకి జారాయా.. అన్నట్టు కొండపై మంచు తెరలు తేలియాడుతున్నాయి. వంజంగి కొండను తాకుతూ అలముకున్న దట్టమైన పొగమంచు పాలసముద్రాన్ని తలపిస్తోంది. పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ.. సహజసిద్ధమైన ఈ అందాలను చూసి మైమరచిపోతున్నారు.

Helipad tour in Goa: ఆకాశంలో విహరిస్తూ గోవా బీచ్ అందాలు చూడొచ్చు: అందుబాటులోకి వచ్చిన హెలి టూరిజం

సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. వేకువజాము నుంచి ఈ రమణీయ దృశ్యాలను చూసేందుకు పోటీ పడుతున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి మేఘాలను తలపిస్తున్న మంచు తెరల రమణీయ దృశ్యాలను చూస్తూ సందడి చేస్తున్నారు. ఉదయం పది గంటల వరకు మంచు తెరలు వీడలేదు. దీంతో వాహనదారులు హెడ్‌ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది.