Amara Raja Group: ఏపీకి గుడ్ బై చెప్పనున్న అమర్ రాజా బ్యాటరీస్?

బ్యాటరీ సెక్టార్ లో దేశంలోనే రెండవ అతిపెద్ద సంస్థ అమర్ రాజా. ఈ సంస్థ గురించి దాదాపుగా తెలుగు ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు ప్రస్తుతం ఆయనే డైరెక్టర్ గా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఏపీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా ఏపీ రాజకీయ, వ్యాపార వర్గాలలో వినిపిస్తుంది.

10TV Telugu News

Amara Raja Group: బ్యాటరీ సెక్టార్ లో దేశంలోనే రెండవ అతిపెద్ద సంస్థ అమర్ రాజా. ఈ సంస్థ గురించి దాదాపుగా తెలుగు ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు ప్రస్తుతం ఆయనే డైరెక్టర్ గా ఉన్నారు. చిత్తూరు జిల్లా నుండే అన్ని కార్యకలాపాలను సాగించే ఈ కంపెనీలో బ్యాటరీలు, ఇన్వెర్టర్లతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కూడా సాగుతుంది.

ప్రస్తుతం ఈ సంస్థలో 15 వేలమందికి పైగా స్వయంగా ఉపాధి పొందుతున్నారు. ఏడాదికి 1 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగి ఉన్న ఈ సంస్థ ఏడాదికి పన్నుల రూపంలో రూ.2400 కోట్లు చెల్లిస్తోంది. ఈ మొత్తంలో ఏపీకి రూ.1200 కోట్లు పన్ను వెళ్తుండగా మిగతాది కేంద్రానికి వెళ్తుంది. చిత్తూరు, నెల్లూరుతో పాటు రాయలసీమలో ఈ సంస్థలో ఉపాధి దొరికేలా విద్యాసంస్థలు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తాయంటే ఈ సంస్థ అక్కడ వేసిన ముద్ర ఏంటో చెప్పుకోవచ్చు.

అయితే, ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఏపీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా ఏపీ రాజకీయ, వ్యాపార వర్గాలలో వినిపిస్తుంది. కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వం.. అమర్ రాజా సంస్థకు మధ్య పలు వివాదాలు జరుగుతున్నాయి. అవి రాజకీయ పరమైన కారణాలా లేక వ్యాపారం సంబంధ లావాదేవీల అన్నది పక్కన పెడితే ఇప్పుడు ఈ సంస్థ పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు వెళ్లేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తుంది.

ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్‌తో అమరరాజా యాజమాన్యం చర్చలు జరపగా.. స్టాలిన్ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించినట్లుగా చెప్తున్నారు. యాజమాన్యం ఆశించినట్లుగా ఇప్పటికే స్థలం కేటాయింపు కూడా పూర్తికాగా సంస్థ తరలింపుకు ముమ్మర పనులు సాగుతున్నట్లు తెలుస్తుంది. మరో 3 నెలల్లో అమర్ రాజా సంస్థ ఏపీలోని చిత్తూరు నుంచి తమిళనాడుకి తరలివెళ్లనున్నట్లు సమాచారం.

10TV Telugu News