సంక్రాంతి పూట విషాదం : రాజధానిలో ఆగిన మరో గుండె

10TV Telugu News

రాజధాని ప్రాంతంలో మరో గుండె ఆగిపోయింది. అమరావతిని తరలిస్తారేమోనన్న భయం, తీవ్ర మనస్థాపానికి గురై చనిపోతున్నారు. తాజాగా వెలగపూడలో రైతు శివయ్య గుండెపోటుతో మృతి చెందాడు. రాజధాని తరలిపోతుందన్న మనోవేదనకు గురైనట్లు బంధువులు చెబుతున్నారు. అమరావతి పోరాటంలో శివయ్య చురుకుగా పాల్గొన్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమని పలుమార్లు ప్రకటించారు. శివయ్య మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన, GN RAO కమిటీలు ఇచ్చిన నివేదికతో రాజధాని ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 29 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేపడుతున్నారు. వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు..అమరావతే ముద్దు అంటూ..ఆందోళనలు చేస్తున్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడిలో రైతులు నిరహార దీక్షలు కంటిన్యూ చేస్తున్నారు.

Read More : కొత్త అల్లుళ్లు..సరదాల సంక్రాంతి

రాజధానిని పరిరక్షించుకొనేందుకు రైతులు, మహిళలు 2020, జనవరి 15వ తేదీ బుధవారం ఉపవాస దీక్షలు చేస్తున్నారు. సాయంత్రం 5గంటల వరకు ఉపవాసం చేయనున్నారు. అమరావతి పరిరక్షణ సమితిగా ఏర్పాటై ఆందోళనలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజు..నారా, నందమూరి కుటుంసభ్యులు అమరావతిలో పర్యటించనున్నారు. ప్రతి సంవత్సరం నారావారిపల్లెకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నందమూరి కుటుంసభ్యులు వెళుతుంటారు. కానీ ఈసారి మాత్రం పండుగ జరుపుకోవడం లేదని వారు ప్రకటించారు. తాజాగా రైతు మరణంతో రాజధాని ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

 

రైతు సంబరం సంక్రాంతి. అలాంటి పండుగ పూట రైతు నెలకొరిగాడు. 28 రోజుల పాటు జై అమరావతి అంటూ ఉద్యమించినా దున్నపోతు ప్రభుత్వంలో చలనం లేకపోయే సరికి ఆందోళన చెంది రైతు అంబటి శివయ్య గుండె పోటుతో మరణించారు.(1/2) pic.twitter.com/M6sGz19OiM

10TV Telugu News