Amaravathi: వైసీపీ-టీడీపీల మధ్య ల్యాండ్ వార్

ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య.. మాటల తూటాలు పేలుతున్నాయ్‌. అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంపై వైసీపీ ప్రశ్నిస్తుంటే.. అపోజిషన్‌లో ఉన్న టీడీపీ విశాఖలో అక్రమాలు జరిగాయంటూ..

Amaravathi: వైసీపీ-టీడీపీల మధ్య ల్యాండ్ వార్

Ysrcp Tdop Land Dispute

Amaravathi: ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య.. మాటల తూటాలు పేలుతున్నాయ్‌. అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంపై వైసీపీ ప్రశ్నిస్తుంటే.. అపోజిషన్‌లో ఉన్న టీడీపీ విశాఖలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తోంది. దీంతో.. వైసీపీ టీడీపీ ల్యాండ్‌ ఫైట్‌ హై రేంజ్‌కు చేరుతోంది.

ఏపీలో తాజా రాజకీయం అసైన్డ్‌ భూముల చుట్టూ తిరుగుతోంది. అమరావతి అసైండ్ భూముల్లో భారీ కుంభకోణం జరిగిందంటూ.. గత ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది వైసీపీ సర్కార్‌. అయితే తామేమీ తగ్గమన్నట్లు.. టీడీపీ కూడా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రత్యారోపణలకు దిగుతోంది. వైజాగ్‌లో ప్రభుత్వం సేకరించిన భూముల్లో అసైన్డ్‌ భూములు లేవా అంటూ నిలదీస్తోంది. దీనితో అసైండ్ భూముల రాజకీయం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

అమరావతిలో చంద్రబాబు.. అతని అనుచరులు అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌ అయ్యారు. అసైన్డ్‌ భూములను లాక్కునేందుకు ఆయన బినామీలు.. బాధితులను బెదించారని మండిపడ్డారు. వేల కోట్లు దోచుకుని వాటిని కప్పిపుచ్చుకునేందుకు జీవో నెంబర్‌ 41 తీసుకొచ్చారన్నారు సజ్జల. చంద్రబాబు ఆలోచన మంచిదయితే.. ల్యాండ్ పూలింగ్ యాక్ట్‌తో అసైన్డ్ ల్యాండ్ గురించి ఎందుకు పెట్టలేదని సజ్జల ప్రశ్నించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ ఎదురు దాడికి దిగుతోంది. వైసీపీ ఆరోపణల్లో పస లేదన్నారు టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర. అసైన్డ్‌ ల్యాండ్స్ తీసుకునే విషయంలో సీఆర్డీఏ చట్టం వచ్చిన తరువాత జీవో నెంబర్ 41 వచ్చిందని.. ఎలా అక్రమాలు జరిగాయని ప్రశ్నించారు. వైసీపీ సర్కార్‌ విశాఖలో సేకరించిన 6 వేల 200 ఎకరాల భూమిలో అసైన్డ్‌ భూములు లేవా అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.

హైకోర్టు ఎన్ని స్టేలు ఇచ్చినా మరో కోణంలో రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన భూ క్రయ విక్రయాలపై ప్రభుత్వం విచారణ చేస్తూ పట్టు బిగిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయని కొందరు భావిస్తుంటే.. కేసులపై వైసీపీ ప్రభుత్వం వెనకడుతు వేయదంటున్నారు మరికొందరు రాజకీయ విశ్లేషకులు.

సో మొత్తంగా.. అమరావతి, విశాఖ అసైన్డ్‌ భూముల వ్యవహారం ఏపీ రాజకీయ పార్టీలకు ఆయుధాలుగా మారింది. రెండు రాజధానుల్లో భూముల వ్యవహారం ఇప్పుడు హాట్‌ ఇష్యూ అవుతోంది.