పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు విచారణ..తప్పుకున్న జస్టిస్ నారిమన్..విచారణ వాయిదా

  • Published By: madhu ,Published On : August 19, 2020 / 12:32 PM IST
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు విచారణ..తప్పుకున్న జస్టిస్ నారిమన్..విచారణ వాయిదా

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ మరోసారి వాయిదా పడింది. కేసు విచారణ నుంచి జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అమరావతి రైతుల తరపున వాదించేందుకు పాలిసామ్ నారిమన్ విచారణకు హాజరయ్యారు. దీంతో…విచారణపై నాట్ బి ఫోర్ అని వ్యాఖ్యానిస్తూ..న్యాయమూర్తి నారిమన్ తప్పుకున్నారు.

ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేసే అవకాశం ఉంది. మరో ధర్మాసనం ఏర్పాటయ్యాక..శుక్రవారం, లేదా సోమవారం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ కేసు కీలకంగా భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. కానీ వరుసగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఏపీ హైకోర్టు విధించిన స్టేటస్ కోపై ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. స్టే ఎత్తివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతోంది.