Amaravati: శ్మశానం, నీట మునిగే ప్రాంతం అన్నారు.. పేదలకు ఎలా కేటాయిస్తున్నారు? సీఎం జగన్ కుట్రలను తిప్పికొడతాం..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. చెల్లిని పంపించావు, తల్లిని పంపించావు మేము ఎక్కడికి వెళ్లాలి అంటూ అమరావతి రాజధాని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Amaravati: శ్మశానం, నీట మునిగే ప్రాంతం అన్నారు.. పేదలకు ఎలా కేటాయిస్తున్నారు? సీఎం జగన్ కుట్రలను తిప్పికొడతాం..

AP CM Jagan

Amaravati: హైకోర్టు ఆదేశాల తర్వాత అమరావతిలోని ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమరావతి రాజధాని రైతులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పి కొడతామంటూ చెబుతున్నారు. బుధవారం వెలగపూడి జేఏసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం రాజధాని జేఏసీ నాయకులు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కంభం పాటి శిరీష మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయించిన సెంటు భూమి మోసపూరితమైన కుట్ర అని అన్నారు. టిట్కో ఇల్లు 5000 కట్టి ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజధాని మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా పేదలకు ఒక సెంటు భూమి ఇవ్వటం హాస్యాస్పదం అన్నారు.

Amaravati Capital Issue: అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. విచారణ జూలైకి వాయిదా

ఆర్5 జోన్‌లో 1700 ఎకరాలు భూమిని రెండు జిల్లాల నుంచి పేదలకు ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. అమరావతిని ఎందుకు డెవలప్ చేయట్లేదు? అమరావతిలో ఉన్న పేదలకు ఎందుకు న్యాయం చేయట్లేదని ప్రశ్నించారు. అమరావతి స్మశానం నీట మునిగే ప్రాంతం అన్న ముఖ్యమంత్రి ఇవాళ పేదలకు సెంటు భూమి ఎలా ఇస్తున్నారని వారు ప్రశ్నించారు. పేద బడుగు బలహీనవర్గాల ప్రజలు జగన్ మోహన్ రెడ్డి వల్ల దగా పడవద్దని అన్నారు. రాజధాని రైతులు పేద ప్రజలకు వ్యతిరేకం కాదని, మోసం చేస్తున్న సీఎం జగన్ రెడ్డి కుట్రను మనం తిప్పికొడదామని అన్నారు.

TS 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. 86.60శాతం ఉత్తీర్ణత

పోతుల బాల కోటయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. చెల్లిని పంపించావు, తల్లిని పంపించావు మేము ఎక్కడికి వెళ్లాలి అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రాన్ని నాశనం చేశావు, పొలాలు ఇచ్చిన రైతుల్ని అన్యాయం చేస్తు మీ స్వార్థంకోసం పేద ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి భూమిని ఇచ్చిన వాళ్ళకి శిరస్సు వంచి దండాలు పెడుతున్నారు. అలాగే రాజధాని కోసం ఇచ్చినప్పుడు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. కృష్ణానది ఒడ్డున విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా బుద్ధుడు నడయాడిన ప్రాంతంలో ఈ రాజధాని కడుతుంటే దీని విలువ నీకు తెలియదా అంటూ ప్రశ్నించారు.

Andhra Pradesh : ఇడుపుల పాయలో సొరంగాలు తవ్వి అక్రమ సొమ్ము దాచి పెడుతున్నారు : అచ్చెన్నాయుడు

రాష్ట్రంలోని నిరుపేదలకు రాజధాని ప్రాంతంలో సెంటు భూమి ఇవ్వటం రైతులు వ్యతిరేకం కాదు. ఇలాచేస్తే రాబోయే ప్రభుత్వం ఈ సెంటు భూమిని రద్దు చేసే విధంగా ముందుకు వెళుతుంది. నీ తాడేపల్లి ప్యాలెస్‌లోగాని, ఇడుపులపాయలోగాని రాళ్లు పడితే ఎలా ఉంటుంది. మా రాజధాని ప్రాంతంలో రైతులు బాధతో వున్నారు గమనిస్తున్నావా జగన్ అంటూ ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో జేఏసీ నాయకులతో కలిసి ఎలా ముందుకు వెళ్అలి.. ఈ సమస్యను ఎదుర్కొంటాం. కచ్చితంగా జగన్ కుట్రలను అడ్డుకొని తీరుతామని తెలిపారు.