Ap politics: అయ్యన్న పాత్రుడు వర్సెస్ అంబటి ట్విటర్ వార్.. రాసలీలల గోల.!

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ మరికాస్త పెరిగింది.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరిపోతోంది. మైకులతో ఒకరిపై ఒకరు మాటల దాడి ఇన్నాళ్లు సాగగా.. ఇప్పుడు ట్విటర్ వార్ అదే స్థాయిలో ఏపీ రాజకీయాల్లో హీట్ పెచ్చుతుంది...

Ap politics: అయ్యన్న పాత్రుడు వర్సెస్ అంబటి ట్విటర్ వార్.. రాసలీలల గోల.!

Ambari Vs Ayyanna

Ap politics: ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ మరికాస్త పెరిగింది.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరిపోతోంది. మైకులతో ఒకరిపై ఒకరు మాటల దాడి ఇన్నాళ్లు సాగగా.. ఇప్పుడు ట్విటర్ వార్ అదే స్థాయిలో ఏపీ రాజకీయాల్లో హీట్ పెచ్చుతుంది. టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబుల మధ్య ట్విటర్ లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. కాంబాబు అంటూ అయ్యన్న పాత్రుడు విరుచుకు పడుతుండగా.. అదే స్థాయిలో అంబటి రాంబాబుసైతం కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

ఇంతకీ వీరి మధ్య ట్విటర్ వార్ మొదలవ్వటానికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే గత నాలుగు రోజుల క్రితం ఏపీకి చెందిన ఓ మంత్రి ఓ ట్వీట్ చేశాడు.. దానికి బదులుగా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. ’సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబుకి వాట్సాప్ లో ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ మెసేజ్ చేసిందని.. ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ కాంబాబు రిప్లే ఇచ్చాడని, త్వరలో ఆ వివరాలు ప్రపంచాని తెలియజేస్తానంటూ ట్వీట్ చేశారు.. మరుసటి రోజు.. ఆడదైతే చాలు సొంత కూతురిని కూడా వంకర చూపులు, వంకర మాటలు మాట్లాడే రకం నువ్వు.. కాంబాబు.. త్వరలోనే యుట్యూబ్ యాంకర్ సీఎంను కలబోతుంది.. ఇక నీ చీటీ చినిగినట్టే అంటూ మరో ట్వీట్ చేశారు అయ్యన్న పాత్రుడు..

తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ నేతలపై విరుచుకు పడ్డారు. చిన్ని గోపాలుడి బెడ్ రూమ్ లో తుపాకులు పేలడానికి ఎవరి రాసలీలు కారణం..? అంటూనే మరో రెండు వ్యాఖ్యలు యాడ్ చేస్తూ ట్వీట్ చేశాడు. బట్టబయలు చేస్తాను.. బద్దలు కొడతాను, బర్తరఫ్ చేయిస్తానని ట్విటర్ లోనే మొరుతూ సైడ్ అయిపోయింది.. ఎవరు అంటూ ప్రశ్నించిన కొద్దిగంటల్లోనే.. అయ్యన్న పాత్రుడు తన ట్విటర్ లో ఓ ఆడియోను పోస్టు చేశాడు.. ఇలా ఈ ఇద్దరి మధ్య ట్విటర్ వార్ తారాస్థాయికి చేరిపోయింది. ఈ ట్వీట్లకు వీరు సరిపోరన్నట్లు. ఇరు పార్టీలకు చెందిన నేతలు రీ ట్వీట్లు చేస్తూ.. రాసలీలల గోలను మరింత రక్తికట్టించే పనిలో పడ్డారు..