పవన్.. సినిమాలు చేస్తే తప్పేంటి : లక్ష్మీనారాయణపై నిర్మాత ఫైర్

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై నిర్మాత అంబికా కృష్ణ ఫైర్ అయ్యారు. పవన్ సినిమాల్లో నటిస్తే తప్పేంటి? మీకు నొప్పేంటి? అని లక్ష్మీనారాయణను అంబికా కృష్ణ ప్రశ్నించారు. తన

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 12:38 PM IST
పవన్.. సినిమాలు చేస్తే తప్పేంటి : లక్ష్మీనారాయణపై నిర్మాత ఫైర్

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై నిర్మాత అంబికా కృష్ణ ఫైర్ అయ్యారు. పవన్ సినిమాల్లో నటిస్తే తప్పేంటి? మీకు నొప్పేంటి? అని లక్ష్మీనారాయణను అంబికా కృష్ణ ప్రశ్నించారు. తన

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై నిర్మాత అంబికా కృష్ణ ఫైర్ అయ్యారు. పవన్ సినిమాల్లో నటిస్తే తప్పేంటి? మీకు నొప్పేంటి? అని లక్ష్మీనారాయణను అంబికా కృష్ణ ప్రశ్నించారు. తన సపోర్ట్ ఎప్పుడూ పవన్ కేనని తెలిపారు. ఓ వీడియోను విడుదల చేసిన అంబికా కృష్ణ… అందులో పవన్ కు మద్దతు తెలిపారు. లక్ష్మీనారాయణ తీరుని తప్పుపట్టారు. పవన్ సినిమాల్లో నటిస్తున్నారు.. అందుకే నేను రాజీనామా చేస్తున్నా.. అని లక్ష్మీనారాయణ చెప్పడం నేను విన్నాను.. ఇది చాలా బాధాకరం.. ఎవరు ఏ వృత్తిలో ఉంటే వారు దాన్ని వ్యాపారంగా చేసుకుంటారు. అందులో తప్పేముంది. పవన్ సినిమాలతో హీరోగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి మళ్లీ సినిమాల్లో నటిస్తే తప్పేంటి? సినిమాలు మానేసి రాజకీయాలు చేయాలని ఎక్కడా లేదు” అని పవన్ ను వెనకేసుకొచ్చారు.

జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పవన్ మళ్లీ సినిమాల్లో నటించడం ఇష్టం లేకనే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. పవన్ విధానాల్లో నిలకడ లేదని విమర్శించారు. లక్ష్మీనారాయణ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జనసేనాని. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లేవంటూ పరోక్షంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు మీద సెటైర్లు వేశారు. ఇక తనకు భారీగా జీతాలు వచ్చే ఉద్యోగాలు కూడా లేవంటూ పరోక్షంగా సీబీఐ మాజీ జేడీని టార్గెట్ చేశారు. తనకు వచ్చిన పని సినిమాలు చేయడమేనని, తనను నమ్ముకుని ఉన్న వారిని, కుటుంబం కోసం తనకు వచ్చిన పని చేస్తున్నానని పవన్ చెప్పారు.

రాజకీయాల్లో బిజీ కావడంతో రెండేళ్ల నుంచి పవన్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. హిందీలో హిట్ అయిన పింక్ సినిమా తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కొన్ని రోజుల క్రితం మొదలైంది. అలాగే, క్రిష్ హీరోగా మరో సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ సంతకం చేశారు.

బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తుండడంతో కొందరు నిర్మాతలు కూడా పవర్ స్టార్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. పవన్ మళ్లీ సినిమాల్లో నటించడాన్ని కొందరు తప్పుపడితే.. కొందరు సపోర్ట్ చేస్తున్నారు. పార్టీని నడిపించడానికి నిధులు అవసరమని, అందుకే పవన్ మళ్లీ సినిమాల్లోకి వచ్చారని సమర్థించారు.

Also Read : అసలు కారణం అదేనా : జనసేనకు CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా