Ambika Krishna : హీరోలు, దర్శకులదే తప్పు… అందుకే థియేటర్లపై ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది

ఏపీలో ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగటం లేదు. పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ జరగకపోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేదు. అందుకే ప్రభుత్వం సినీ పరిశ్రమ..

Ambika Krishna : హీరోలు, దర్శకులదే తప్పు… అందుకే థియేటర్లపై ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది

Ambika Krishna

Ambika Krishna : ఏపీలో సినీ పరిశ్రమపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ అంబికా కృష్ణ స్పందించారు. ప్రభుత్వం చేస్తుంది సరైనదే అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదాయం లేనప్పుడు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుందన్నారు.

ఏపీలో ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగటం లేదని అంబికా కృష్ణ అన్నారు. పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ జరగకపోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేదన్నారు. అందుకే ప్రభుత్వం సినీ పరిశ్రమ, థియేటర్లపై ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. కాగా, సీ క్లాస్ థియేటర్ల టిక్కెట్ల రేట్లు తగ్గింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని అంబికా కృష్ణ విజ్ఞప్తి చేశారు.

Xiaomi 11i Hypercharge : ఫాస్ట్ హైపర్‌‌చార్జ్ స్మార్ట్‌ఫోన్‌.. 15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్.. జనవరి 6న వచ్చేస్తోంది!

”నేను సినీ పరిశ్రమ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఏపీలో సినిమా షూటింగ్స్ చేయాలని పెద్ద హీరోలకు సూచించాను. అప్పుడు సినీ పరిశ్రమ పట్టించుకోలేదు. ఏపీలో సినిమా షూటింగ్స్ చేయకపోవడం హీరోలు, దర్శకులదే తప్పు. అందులో నిర్మాత ఏమీ చేయలేడు. వాళ్లు చెప్పింది నిర్మాత చేయక తప్పదు. నా అభిప్రాయంలో ప్రభుత్వం చేస్తున్నది సరైనదే. కాగా, పల్లెల్లో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి” అని అంబికా కృష్ణ అన్నారు.

”ఏపీలో ప్రభుత్వానికి, థియేటర్లకు మధ్య రగడ నడుస్తోంది. దాదాపు 55 థియేటర్లు స్వచ్ఛందంగా మూసేశారు. సీ సెంటర్లలో రూ.5, 10తో థియేటర్ల నిర్వహణ అసాధ్యం. ఈ విషయంపై మంత్రి పేర్నినాని పునరాలోచించాలి. బీఫామ్‌ లైసెన్స్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే అనుమతించాలి” అని అంబికా కృష్ణ కోరారు.

Gmail user ALERT : మీ ఆండ్రాయిడ్, ఐఫోన్ నుంచి Secret email ఇలా పంపుకోవచ్చు!

సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రచ్చ కొనసాగుతోంది. సినిమా వర్సెస్ రాజకీయంగా మారింది. ఈ నేపథ్యంలో అంబికా కృష్ణ చేసిన కామెంట్స్ మరింత హీట్ పెంచాయి.