Amit Shah : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా, జగన్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఏపీ సీఎం జగన్, పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు.

Amit Shah : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా, జగన్

Amit Shah

Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఏపీ సీఎం జగన్, పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. శ్రీవారి ఆలయం మ‌హాద్వారం దగ్గర అమిత్ షా, జగన్ కి టీటీడీ ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జ‌వ‌హ‌ర్‌ రెడ్డి స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడి నుండి విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు చెల్లించారు.

World Diabetes Day 2021 : ప్రతి షుగర్ పేషెంట్ తప్పక తినాల్సిన 5 పండ్లు ఇవే..!

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అమిత్ షా, జగన్ కి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి చిత్రపటంతో పాటు టీటీడీ డైరీ క్యాలెండర్లను బహుకరించారు. వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అంతకుముందు మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అమిత్ షాకు సీఎం జగన్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. తిరుపతిలోని తాజ్ హోటల్‌ లో హోంమంత్రి అమిత్ షా బస చేశారు.

ఆదివారం ఉదయం అమిత్ షా భారత వైమానిక దళ హెలికాప్టర్‌లో బయల్దేరి నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు. అక్షర విద్యాలయ, స్వర్ణ భారతి ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్ లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వర్ణ భారతి ట్రస్ట్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

WhatsApp Feature: వాట్సప్‌లో కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్

మరోవైపు 29వ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి తిరుపతి వైదికైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షత వహిస్తారు. ఈ మీటింగ్‌కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై హాజరవుతున్నారు. మిగతా రాష్ట్రాల నుంచి సీఎంలకు బదులుగా మంత్రులు, ఉన్నతాధికారులు వస్తున్నట్లు సమాచారం.