అమరావతికే జై కొట్టిన శివరామకృష్ణన్ కమిటీ – బాబు

10TV Telugu News

శివరామకృష్ణ కమిటీ అమరావతికే మొగ్గు చూపిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో వెల్లడించారు. 2014 విభజన చట్టం ప్రకారం..ఏపీకి కొత్త రాజధాని అవసరమని ఓ కమిటీని వేయడం జరిగిందని గుర్తు చేశారు. సెక్షన్ 5 (2)లో పేర్కొన్న విషయాన్ని మరోసారి చూడాలని సూచించారు. 2020, జనవరి 20వ తేదీన మూడు రాజధానుల అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా..బాబు మాట్లాడుతూ…

చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందని..రాజధానులు కాదన్నారు. ఏపీకి రాజధాని అవసరమని భావించి ఓ కమిటీని వేయడం జరిగిందని, శివరామకృష్ణన్ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందన్నారు. విజయవాడ, గుంటూరు బెస్ట్ క్లస్టర్ అని చెప్పడం జరిగిందన్నారు. తరచూ వరదలు వస్తాయంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వైసీపీ వాళ్లు వెళ్లారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతాన్ని వరద ముప్పుగా పరిగణించలేమని వెల్లడించడం జరిగిందన్నారు.

రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపై శివరామకృష్ణయ్య కమిటీ నిర్ధిష్టంగా చెప్పలేదని సభలో వెల్లడించారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొన్నారని ఆరోపించారనే విషయాన్ని చెప్పారు. భూ సేకరణ పథకంలో రైతులు భంగపడే విధంగా జరగలేదని, ఆ పథకం మేలు జరుగుతుందని వెల్లడించారని, ఆహార భద్రతకు భంగం కలుగదని కమిటీ చెప్పిందన్నారు బాబు. 

అంతకంటే ముందు..బాబు మాట్లాడుతూ..ఒక రాష్ట్రం ఒక రాజధాని ఇదే టీడీపీ సిద్ధాంతమన్నారు. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వ విధానాన్ని వైసీపీ సభ్యులు చెబితే బాగుండే కానీ..వ్యక్తిగతంగా తనను తిట్టారని, అయినా ప్రజల కోసం సద్వివిమర్శలుగా తీసుకుంటానన్నారు. 

Read More : అమరావతిలో అప్పుడే ఎందుకు కొన్నావ్ పయ్యావుల – మంత్రి బుగ్గన