Youngster Killed : కారుతో తొక్కించి తమ్ముడిని చంపిన అన్న

ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. తమ్ముడికి ఆసరాగా ఉండాల్సిన అన్న కాలయముడయ్యాడు. సోదరుడుని కారుతో తొక్కించి దారుణంగా హత మార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Youngster Killed : కారుతో తొక్కించి తమ్ముడిని చంపిన అన్న

Youngster Killed : ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. తమ్ముడికి ఆసరాగా ఉండాల్సిన అన్న కాలయముడయ్యాడు. సోదరుడుని కారుతో తొక్కించి దారుణంగా హత మార్చాడు. ఈ ఘటన త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కంచర్ల వెంకటేశ్వర్లు గౌడ్, ఏడుకొండలు గౌడ్‌ అన్నదమ్ములు.

Murder : పెళ్లి చేయమని అడిగిన తమ్ముడిని హత్య చేసిన అన్న

గత కొంతకాలంగా వీరి కుటుంబాల మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డుపై వెళ్తున్న తమ్ముడి పైకి వెంకటేశ్వర్లు కారును తోలి ప్రాణం తీశాడు. అనంతరం నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.