Accident : ఫ్లైవోవర్ పై డివైడర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

కర్నూలు జిల్లాలోని డోన్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు ఫ్లైవోవర్ పై డివైడర్ ను ఢీకొట్టింది. రెయిలింగ్ దాటి బస్సు ఆగింది. బస్సు ముందు భాగం కొంత గాలిలో తేలియాడింది.

Accident : ఫ్లైవోవర్ పై డివైడర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Bus

RTC bus collided divider : కర్నూలు జిల్లాలోని డోన్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు ఫ్లైవోవర్ పై డివైడర్ ను ఢీకొట్టింది. రెయిలింగ్ దాటి బస్సు ఆగింది. బస్సు ముందు కొంత భాగం గాలిలో తేలియాడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆటోను తప్పించబోయే క్రమంలో బస్సు డివైడర్ ను ఢీకొట్టినట్లు సమాచారం.

ఏ మాత్రం అదుపు తప్పినా బస్సు కిందపడి భారీగా ప్రాణ నష్టం జరిగివుండేదని స్థానికులు చెబుతున్నారు. రెయిలింగ్ పెచ్చులు ఊడి పడి పలువురికి గాయాలయ్యాయి. డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

బ్రిడ్జీ కింద ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం నుంచి కర్నూలుకు వస్తున్న ఆర్టీసీ బస్సు డోన్ లోని ఫ్లైవోవర్ ఢీవైడర్ ను ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిలో కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి.

అయితే బస్సు ఫ్లైవోవర్ నుంచి కిందకు పడి పోయి ఉంటే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉండేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఫ్లైవోవర్ పై బస్సు అతివేగంగా వెళ్లడంతోనే డివైడర్ ను ఢీకొట్టి పెచ్చులు ఊడి పడి కింద ఉన్న వారికి గాయాలయ్యాయి.

దాదాపు ఎనిమిది మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అందులో యువకులు, ముగ్గురు పిల్లలకు గాయాలైనట్లు తెలుస్తోంది. తల, చేతులకు గాయాలు కావడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు.. ఫ్లైవోవర్ డివైడర్ ను ఢీకొట్టడంతో బస్సులోని ప్రయాణికులు, ఫ్లైవోవర్ కింద ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.