Anandaiah Medicine : రాష్ట్రవ్యాప్తంగా ఆనందయ్య మందు పంపిణీ

కరోనా విపత్కర పరిస్థితుల్లో నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందు దేశవ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు గురించి సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు కోసం ఎవరు కూడా కృష్ణపట్నం

Anandaiah Medicine : రాష్ట్రవ్యాప్తంగా ఆనందయ్య మందు పంపిణీ

Anandaiah Medicine State Wide Distribution

Anandaiah Medicine : కరోనా విపత్కర పరిస్థితుల్లో నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందు దేశవ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు గురించి సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు కోసం ఎవరు కూడా కృష్ణపట్నం రావలసిన అవసరం లేదని ఆయన అన్నారు. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ ప్రాంతానికైనా మందు అవసరమైతే వాళ్లకు చేరవేసే దానికి అన్ని మార్గాలు పరిశీలిస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. కొరియర్, ఆన్ లైన్ ద్వారా ఈ మందును కోవిడ్ పేషెంట్లకు, అవసరమైన వారికి పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నేరుగా ఇళ్లకే మందుని పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక మందు తయారీ విధానాన్ని వికేంద్రీకరణ చేసి మందు తయారు చేసే అవకాశాలు కూడా ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ముందుగా నెల్లూరు జిల్లా వాసులకు మందు పంపిణీ జరుగుతుందని కాకాణి స్పష్టం చేశారు.

తుడా కార్యాలయంలో కొవిడ్ పరిస్థితులపై తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆనందయ్య మందును గ్రామీణ వైద్యంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెవిరెడ్డి చెప్పారు. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీల్లో ఆయుర్వేద మందుల తయారీకి మాత్రమే అనుమతి ఉందన్నారు. టీటీడీ ఛైర్మన్ తో మాట్లాడి సీఎం జగన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళతామన్నారు. దీనిపై ప్రజలకు ఆమోదయోగ్యమయ్యేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి అడ్డంకులు తొలగిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వంతో పాటు హైకోర్టు సైతం ఈ మందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే కంట్లో వేసే మందుకు మాత్రం ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఐ డ్రాప్స్‌కు కూడా అనుమతి ఇవ్వాలని ఆనందయ్య హైకోర్టును కోరగా.. దాని కోసం ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. అందుకు ఒప్పుకోని హైకోర్టు ఆ రిపోర్టును గురువారం సమర్పించాలని ఆదేశించింది.

‘ఆనందయ్య మందు వాడితే కొవిడ్‌ తగ్గిందనడానికి ఆధారాలు లేవు. ఆయన పి, ఎల్‌, ఎఫ్‌, కె అనే మందులతో పాటు కంట్లో చుక్కలు వేస్తున్నారు. పి, ఎల్‌, ఎఫ్‌లకు సంబంధించి నాణ్యత, రక్షణపరంగా సమస్యల్లేవు. ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలలేదు. వాటి పనితీరును పరిశీలించేందకు సీసీఆర్‌ఏఎస్‌ కొన్ని ప్రయత్నాలు చేసింది. ‘కె’ అనే మందు తయారీకి వాడే ముడిపదార్థాలు అందుబాటులో లేనందున మా వైద్యుల కమిటీ వాటిని పరిశీలించలేదు. కంట్లో చుక్కలకు సంబంధించి నివేదికలు రావాల్సి ఉంది. దీనివల్ల నష్టం జరగదని చెప్పేందుకు ఆధారాలు లభించ లేదు. దీనిపై నిర్ధారణకు వచ్చేందుకు 3 వారాల సమయం పడుతుంది’ అని ఆయుష్ కమిషన్ రాములు సీఎం జగన్‌కు నివేదించారు. దీని ఆధారంగా ప్రభుత్వం ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చింది.