Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లకు ఇటీవల అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్

Tirumala: భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తనకు కాబోయే భార్యతో కలిసి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారిద్దరూ స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Mukesh Ambani: అనంత్-రాధిక నిశ్చితార్థ వేడుక.. అంబానీ కుటుంబం డ్యాన్స్ చూశారా!

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లకు ఇటీవల అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. నిశ్చితార్ధం అనంతరం కాబోయే దంపతులు ఇద్దరు దేశంలోని వివిధ ఆలయాలను సందర్శిస్తున్నారు.

 

అస్సాంలోని కామాఖ్య శక్తి పీఠాన్ని దర్శించుకున్నారు. అదేవిధంగా పూరిలోని జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.