CM Jagan : కరోనా సంక్షోభంలో కూడా రైతుల కష్టాలు తీర్చడానికే శ్రమిస్తున్నాం

అనంతపురంలో సీఎం జగన్ రాయదుర్గంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రాంభించారు. తన పాదయాత్రలో రైతుల కష్టాలను చూసి చలించిపోయేవాడిననీ..రైతు పండించిన పంటను అమ్ముకోవటానికి కష్టపడటం కళ్లారా చూశానని..తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటినుంచి రైతు కష్టాలను తీర్చటానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రైతుల కోసం రూ.1056 కోట్ల అగ్రి ప్రాజెక్టుకలు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.

CM Jagan : కరోనా సంక్షోభంలో కూడా రైతుల కష్టాలు తీర్చడానికే శ్రమిస్తున్నాం

Cm Jagan (1)

CM Jagan Farmer Assurance Center Opening : అనంతపురంలో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా రాయదుర్గంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన పాదయాత్రలో రైతుల కష్టాలను చూసి చలించిపోయేవాడిననీ..రైతు పండించిన పంటను అమ్ముకోవటానికి కష్టపడటం కళ్లారా చూశానని..తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటినుంచి రైతు కష్టాలను తీర్చటానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రైతుల కోసం రూ.1056 కోట్ల అగ్రి ప్రాజెక్టుకలు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. అని నమ్మిన వ్యక్తి మాతండ్రి దివంగత సీఎం శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి..ఆయన జీవించినంత కాలం రైతుల గురించి వారి సంక్షేమం గురించే ఆలోంచేవారని జగన్ ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పాలిస్తున్నామని మేం అధికారంలోకి వచ్చినాటినుంచి రైతుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్నది రైతు ప్రభుత్వం అని..రైతు కోసం ఇప్పటి వరకూ రూ.8,670 కోట్లు ఖర్చుపెట్టామని జగన్ తెలిపారు.

ఈకరోనా కష్టంలో రాష్ట్రం ఉన్నాగానీ పథకాలను అమలు చేయటంలో ఏమాత్రం రాజీ పడకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అక్కచెల్లెళ్లు, రైతులు చాలా కష్టపడుతున్నారు. కానీ వారి కష్టాలతో పోలిస్తే ప్రభుత్వం పడే కష్టాలు పెద్దవేం కాదని అన్నారు. అందుకే రైతులు నాసిరకం విత్తనాలతో మోసపోకుండా..నష్టపోకుండా అర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందజేస్తున్నామనీ..ఆర్డర్ ఇచ్చిన 48 గంటల్లోనే ఎరువులు, విత్తనాలు రైతులకు అందజేస్తున్నామన్నారు.

ఆర్బీకేల ద్వారా ఈ-క్రాఫ్టు చేయిస్తున్నామనీ..రైతులు ఎంత పంట వేశారు? ఎన్ని ఎకరాల్లో వేశారు?అనే వివరాలు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందని తెలిపారు. ఆర్బీకేల ద్వారా రైతులు పొలంలో విత్తనం వేసింది మొదలు పంట చేతికొచ్చి అమ్ముకునేవరకూ రైతుకు ఆర్బీకేలు సహకారం అందజేస్తున్నాయని తెలిపారు. ఇలా ప్రతీ అంశంలోను రైతుల సంక్షేమం కోసం వారి అభివృద్ది కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం జగన్ తెలిపారు.