కరోనా మృతుడికి అంత్యక్రియలు చేయాలంటే అనంతపురంలో రూ.60 వేలు కావాలంట

  • Published By: bheemraj ,Published On : July 27, 2020 / 03:06 PM IST
కరోనా మృతుడికి అంత్యక్రియలు చేయాలంటే అనంతపురంలో రూ.60 వేలు కావాలంట

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆస్పత్రిలోని క్రింది స్థాయి సిబ్బంది 60 వేలు డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించలేక మృతదేహాన్ని మార్చురీలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఇక రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలతో వెళ్తే సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. చేసేది ఏమీ లేక కుటుంబ సభ్యులే ఆ వ్యక్తిని చేతుల మీదే వార్డులోకి తీసుకెళ్లారు. అనంతపురం జిల్లా ఆస్పత్రిలో వారం రోజుల నుంచి రోజుకు ఒకరు చనిపోతున్నారు.

డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్యంతో రెండు రోజుల క్రితం నందమూరి నగర్ కు చెందిన బొమ్మయ్య కరోనాలతో లక్షణాలతో ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరికి బంధువులే అతన్ని చేతుల పట్టుకెళ్లి వార్డులో చేర్పించారు. వార్డులో చేర్పించిన అనంతరం చికిత్స, ఆక్సిజన్ అందక బొమ్మయ్య నిన్న మధ్యాహ్నం మృతి చెందారు. మృతి చెందిన అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆస్పత్రి కింది స్థాయి సిబ్బందితోపాటు బ్రోకర్స్ 60 వేలకు ఒప్పందం కుదుర్చారు. ఈ వాయిస్ రికార్డు కూడా బయటకు వచ్చింది.

60 వేల రూపాయలు ఇచ్చేంత వరకు డెడ్ బాడీని బయటకు ఇవ్వబోమని, అంత్యక్రియలు కూడా జరుపమని కరాకండిగా చెప్పడంతో అసలే కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన బొమ్మయ్య కుుటుం సభ్యులు 15 వేలకు ఇస్తామని బేరమాడినప్పటికీ కచ్చితంగా 45 వేల రూపాయలు ఇస్తే గానీ మృతదేహానికి అంత్యక్రియలు జరుపబోమని చెప్పారు.

ఇలాంటి ఘటన అనంతపురం జిల్లా ఆస్పత్రిలో కోకొల్లుగా జరుగుతున్నా అధికార పక్షం చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. లోపల చాలా జరుగుతున్నా బయటకు వచ్చినవి కొన్ని ఉన్నా..లోపల జరిగేవి ఎన్నున్నాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం 3 గంటలకు ఆస్పత్రికి వచ్చిన వ్యక్తిని వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో చెట్టుకిందే భార్య ఒడిలోనే మృతి చెందిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా ఆస్పత్రిలో శవాల మీద డబ్బులే ఏరుకునే పరిస్థితి దాపురించింది.

ఈ విషయం తెలుసుకున్న అనంతరం జిల్లా కలెక్టర్ చంద్రుడుతోపాటు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు కోవిడ్ సెంటర్ ను పరిశీలించి, కోవిడ్ పేషెంట్ల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పరిస్థతి మరోసారి కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు.